HomeUncategorizedGeneral

వాల్గొండ గోదావరి నది ప్రాంతాల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

వాల్గొండ గోదావరి నది ప్రాంతాల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

వాల్గొండ గోదావరి నది ప్రాంతాల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా యథేచ్ఛగా టిప్పర్ తో ఇసుక అక్రమ రవాణారాత్రి వేళల్లో చీకటి దందాచూసి చూడనట్టు వ్యవహరిస్తున

B Tec మీద మోజు తీరిపోయిందా ? తెలంగాణలో16 వేల సీట్లు మిగులు
ఇది ఎన్నో సారో ? కోమటి రెడ్డి మళ్ళీ అలిగారు!
తెలంగాణ గవర్నర్ తమిళిసై MPగా పోటీ చేయనున్నారా ?

వాల్గొండ గోదావరి నది ప్రాంతాల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

యథేచ్ఛగా టిప్పర్ తో ఇసుక అక్రమ రవాణా
రాత్రి వేళల్లో చీకటి దందా
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

మల్లాపూర్, జూన్ 01 (నినాదం న్యూస్):

మల్లాపూర్ మండలం లో ఇసుక రవాణా విచ్చలవిడిగా జరుగుతుంది. వాల్గొండ గ్రామంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అధిక వేగంతో ఇసుక ట్రాక్టర్ లు వెళ్లడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక రవాణా వలన భూగర్భ జలాలు అడుగంటి పంట పొలాలకు నీళ్లు దొరక్క బీడుగా మారే ప్రమాదం ఉంది. ఈ మాఫియా వలన ఇసుక ధరలు కొండెక్కుతున్నాయి. దీనితో సామాన్యులు సొంత ఇల్లు కట్టుకోలేక సతమతమవుతున్నారు. దీని ప్రభావం నిర్మాణ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. నిబంధనలను తోంగలో తొక్కి ఇష్టానుసారంగా అక్రమా ఇసుక రవాణా నిర్వహిస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారి వస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికీ అయిన అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి