HomeTelanganaPolitics

ఈటలపై పైచేయి సాధించిన బండి సంజయ్…వేములవాడలో టెన్షన్ టెన్షన్

ఈటలపై పైచేయి సాధించిన బండి సంజయ్…వేములవాడలో టెన్షన్ టెన్షన్

వేముల వాడ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి విషయంలో కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది. మాజీ గవ్ర్నర్, బీజేపీ సీనిఅయర్ నేత విద్యాసాగర్ రావు కుమారుడు వ

ఈ మూవీ తెలంగాణలో బీజేపీకి ఓట్లను రాలుస్తుందా ?
బీజేపీ రాష్ట్ర‌ కార్యాలయంలో బండి, ఈటల వర్గాల మధ్య ఘర్షణ‌
తెలంగాణలో హిందుత్వ దూకుడు తగ్గించడం, అవసరమైతే పార్లమెంటులో BRS మద్దతు పొందడం…ఇవీ ఇప్పుడు బీజేపీ లక్ష్యాలు

వేముల వాడ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి విషయంలో కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది. మాజీ గవ్ర్నర్, బీజేపీ సీనిఅయర్ నేత విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు వేములవాడ టికట్ ఇవ్వాలని బండి సంజయ్, తుల ఉమకు టికట్ ఇవ్వాలని ఈటల రాజేంధర్ పట్టుబట్టారు. చివరకు అధిష్టానం ఈట్ల రాజేంధర్ చెప్పిన తుల ఉమను తమ అభ్యర్థిగా ప్రకటించారు.

అయితే కథ అక్కడితో ఆగిపోలేదు. వికాస్ రావు అనుచరులు వేములవాడలో నిరసనకు దిగి హడావుడు సృష్టించారు. మరో వైపు వికాస్ రావుకే టికట్ ఇవ్వాలంటూ బండి సంజయ్ అధిష్టానంపై అన్ని వైపుల నుండి తీవ్ర వత్తిడి తీసుకవచ్చారు.

మరో వైపు తుల ఉమ, వికాస్ రావు ఇద్దరూ నామినేషన్లు వేశారు. అయితే ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఎవరికి బీ ఫార్మ్ వస్తుందో అర్దం కాక అటు అభ్యర్థులు, వారి అనుచరులు రెండు రోజులుగా టెన్షన్ లో ఉన్నారు.

ఒకవైపు బండి సంజయ్, మరో వైపు ఈటల రాజేంధర ల వత్తిడితో ఏం చేయాలో పాలుపోక బీజేపీ అధిష్టానం ఈ రోజు ఉదయం వరకు ఎవ్వరికీ బీ ఫార్మ్ ఇవ్వలేదు. చివరకు బండి సంజయ్ అభిప్రాయానికి విలువ ఇచ్చిన అధిష్టానం ఇక కొద్ది సేపట్లో నామినేషన్లకు సమయం అయిపోతుందనగా వికాస్ రావుకు బీ ఫార్మ్ ఇచ్చింది.

వికాస్ రావుకు బీ ఫార్మ్ ఇవ్వడం తో తుల ఉమ , ఆమె అనుచరులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఆగ్రహంతో రగిలిపోయారు. రోడ్డెక్కి బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమనాయకురాలిని బీజేపీ నాయకత్వం మోసం చేసిందని శాపనార్దాలు పెట్టారు.