అమరుల జ్ఞాపకార్థం మావోయిస్టు పార్టీ (అప్పటి పీపుల్స్ వార్) ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో ఆసియాలోనే అతి పెద్ద స్తూపాన్ని నిర్మించారు. అనంతర కాల
అమరుల జ్ఞాపకార్థం మావోయిస్టు పార్టీ (అప్పటి పీపుల్స్ వార్) ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో ఆసియాలోనే అతి పెద్ద స్తూపాన్ని నిర్మించారు. అనంతర కాలంలో ఆ స్తూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు డైనమెట్లు పెట్టి కూల్చి వేశారు. అయితే కూల్చింది పోలీసులే అనే ఆరోపణలొచ్చాయి.
ఆ స్తూపానికి కావాల్సిన 4 ఎకరాల భూమిని అప్పట్లో రాం చంద్రారెడ్డి అనే భూస్వామి విరాళంగా ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఆ 4 ఎకరాల భూమిని రాం చంద్రారెడ్డి కుమారుడు రాజేశ్వర్ రెడ్డి 25 కోట్లకు కాంతాల రాజేందర్ రెడ్డి(కిసాన్ ఫర్టిలైజర్ దుకాణం),అబ్బర బోయిన సహదేవ్ (గుబ్బడి), బాబురావు (మాజీ పట్వారీ), క్యాప రాము (జగదాంబ రెస్టారెంట్), సన్నీ శ్రీను (వ్యాపారి), కొండూరి శ్రీకాంత్, (వ్యాపారి), బెగజం శ్రీను (వ్యాపారి),మార్గం రవిందర్(వెహికల్ ఇన్స్పెక్టర్), గుండా శ్రీను, కొత్త శ్రీనివాస్ లకు అమ్మాడని మావోయిస్టు పార్టీ ‘జేఎమ్ డబ్ల్యూపీ’ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ ఓ ప్రకటనలో ఆరోపించారు.
హుస్నాబాద్ లో ముందు కట్టిన స్థలాన్ని చంద్రబాబు ప్రభుత్వం హయాంలో గ్రీన్ టైగర్స్, క్రాంతి సేన పేర్లతో ఆ స్తూపాన్ను కూల్చి వేయగా అనంతరం ముత్తినేని రాంచంద్రారెడ్డి (సర్వే నెంబర్ 1189) 4 ఎకరాల భూమిని స్తూఅం కట్టడానికి రాసి ఇచ్చినాడని, ఆ భూమిలో 1990లో ప్రజలు స్తూపం నిర్మాణం చేశారని వెంకటేశ్ పెర్కొన్నారు.
అది అమరుల జ్ఞాపకాల చిహ్నమైన స్తూప స్థలమని, దాన్ని ఇప్పుడు రాజేశ్వర్ రెడ్డి అమ్మేయగా, కొన్న వాళ్ళు ఆ భూమిని ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబూనుకున్నారని ఆరోపించిన వెంకటేశ్, వాళ్ళందరూ ఆ భూమి అమ్మడాన్ని ఆపివేయాలని హెచ్చరించారు. రాజేశ్వర్ రెడ్డి కి ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకొని ఆ భూమిని వదిలివేయాలని లేకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని వెంకటేశ్ హెచ్చరించారు.