HomeTelanganaUncategorized

స్వయం పాలనలో పల్లెలు సస్యశ్యామలం: గంగుల కమలాకర్

స్వయం పాలనలో పల్లెలు సస్యశ్యామలం: గంగుల కమలాకర్

టికెట్లు, బీ ఫామ్ లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది బీజేపీ కాంగ్రెస్ ముసుగులో వస్తున్న ఆంధ్ర నాయకులు మాయ మాటలు చెప్పి కర్ణాటకలో అధిక

కేంద్రానికి మ‌నం రూపాయి ఇస్తే 46 పైస‌లు మాత్ర‌మే తిరిగి వ‌స్తున్నాయి…మోడీపై KTR ద్వజం
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కోకాపేట స్థలం విషయంలో హైకోర్టు నోటీసులు
కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు…ఒక్క సీటులో కూడా బీజేపీకి డిపాజిట్ రాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

టికెట్లు, బీ ఫామ్ లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది

బీజేపీ కాంగ్రెస్ ముసుగులో వస్తున్న ఆంధ్ర నాయకులు

మాయ మాటలు చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్ల జాగ్రత్త

నెల రోజులు నా కోసం కష్టపడితే ఐదేళ్లు మీ ఉరికోసం పాటుపడతా

కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి, నల్లగుంట పల్లిలో ప్రచారంలో మంత్రి గంగుల

టికెట్లు బీ ఫామ్ లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదనీ, మాయ మాటలు చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చేగూర్తి, నల్లగుంటపల్లి గ్రామాలలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు గంగులకు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలకగా ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం రాక ముందు అన్నదాతలు నీళ్ళ కోసం ఆకాశం వైపు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని, నీళ్ళు లేక వేసిన పంటలు ఎండిపోయి అప్పులపాలయ్యారని అన్నారు. కానీ నేడు స్వయంపాలనలో కాళేశ్వరం జలాలతో పల్లెలు సస్యశ్యామలం అయ్యాయని అన్నారు. అన్నదాత అప్పులు చేసే పరిస్థితి రాకుండా పంట పెట్టుబడికి రైతు బంధు అందజేస్తున్నమని అన్నారు. మన సంపదను రాష్ట్రం రాక ముందు ఆంధ్ర నాయకులు దోచుకెల్లి తెలంగాణను ఎండబెట్టరని అన్నారు. రాష్ట్రం వచ్చాక మన సంపద మనకు రావడంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో ఆంధ్ర నాయకులకు కళ్ళ మంట మొదలైందని అన్నారు. ఆనాడు తెలంగాణ వస్తే గుడ్డి దీపం అవుతుందన్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ముసుగులో మళ్ళీ వస్తున్నడని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ ముసుగులో ఆంధ్ర నాయకులు మళ్ళీ వస్తున్నారని, కెసిఆర్ ను ఓడించి తెలంగాణ ను మళ్ళీ ఆంధ్రలో కలపాలని వేచి చూస్తున్నారని అన్నారు. మన తాతలు తండ్రులు చేసిన తప్పుతో యాభై ఏళ్లు గోస పడ్డామని మరోసారి ఓటు తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మూడు సార్లు నన్ను గెలిపించారని, పదిహేనేళ్లు గా మీ బిడ్డగా మీ కళ్ళ ముందే ఉన్నానని , నెల రోజులు నా కోసం కష్టపడితే ఐదేళ్లు మీ ఊరి కోసం పాటు పడతానని అన్నారు.