ఎన్నికలు దగ్గరపడుతున్నాకొద్దీ నాయకుల పార్టీ జంపింగులు పెరిగిపోతున్నాయి. టికట్ దక్కని వారు, అసంత్రుప్తిగా ఉన్నవారు ఇప్పటిదాకా ఉన్న పార్టీని వదిలి మరో
ఎన్నికలు దగ్గరపడుతున్నాకొద్దీ నాయకుల పార్టీ జంపింగులు పెరిగిపోతున్నాయి. టికట్ దక్కని వారు, అసంత్రుప్తిగా ఉన్నవారు ఇప్పటిదాకా ఉన్న పార్టీని వదిలి మరో పార్టీలో చేరిపోతున్నారు.
తాజాగా ఉప్పల్ బీఆరెస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆరెస్ కు రాజీనామా చేసి బీజేపీ లో చేరనున్నారు. బీఆరెస్ ఆయనకు ఉప్పల్ టికట్ ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ముందుగా ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థికి ఉప్పల్ టికట్ ప్రకటించడంతో సుభాష్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.
గతంలో ఉప్పల్ ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నాయకుడు ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్ ను కాదని ఆ పార్టీ మరి సుభాష్ రెడ్డికి టికట్ ఇస్తుందా లేక మరెక్కడైనా టికట్ కేటాయిస్తుందా అన్నది తేలాల్సి ఉన్నది.
ఈరోజు ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.