HomeTelangana

ఉల్లిగడ్డ ధర మండిపోతోంది

ఉల్లిగడ్డ ధర మండిపోతోంది

మనదేశంలో ఉల్లిగడ్డ లేనిదే ఏం ఇంట్లో కూడా రోజు గడవదు. ఏ కూర వండాలన్నా ఉల్లి తప్పనిసరి. అలాంటి ఉల్లి ధరలు ఎప్పుడూ స్థిమితంగా ఉండవు. ఒక సారి 10 రూపాయలకు

హైదరాబాద్ లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ – 50 మందికి గాయాలు
పాక్ జట్టుకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ బిర్యానీ
గద్దర్ కన్నుమూత‌

మనదేశంలో ఉల్లిగడ్డ లేనిదే ఏం ఇంట్లో కూడా రోజు గడవదు. ఏ కూర వండాలన్నా ఉల్లి తప్పనిసరి. అలాంటి ఉల్లి ధరలు ఎప్పుడూ స్థిమితంగా ఉండవు. ఒక సారి 10 రూపాయలకు కిలో దొరికితే మరో సారి 100 రూపాయలవుతుంది. ఎప్పుడు ఉల్లిగడ్డల రేట్లు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి.

మొన్నటి దాకా 150 రూపాయలకు కిలో టమాటాల రేట్లు పలికి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేయగా ఇప్పుడు ఉల్లిగడ్డ ప్రజల కళ్ళలోంచి నీళ్ళు తెప్పిస్తోంది. హైదరాబాద్ లో ప్రస్థుతం కిలీ ఉల్లుగడ్డల ధర 80 రూపాయలకు పైనే పలుకుతోంది. మొన్నటి వరకు 25 రూపాయలు పలికిన ఉల్లిగడ్డ సడెన్ గా 80 రూపాయలవడం వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేశ్తోంది.

ఏ కూర వండాలన్న తప్పని సరి అయిన ఉల్లి కొనకుండా ఉండలేం. ఆకాశాన్నంటుతున్న ధరలను పెట్టి కొనలేం. దాంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. గృహాలు మాత్రమే కాదు, హోటళ్ల వ్యాపారులు, క్యాటరర్లు, వీధి ఆహార వ్యాపారులు కూడా ఏం చేయాలో అర్దంకాక తలలు పట్టుకుంటున్నారు.

నగరంలోని కూరగాయల మార్కెట్లలో మొన్నటి వరకు కనిపించిన ఉల్లుగడ్డల‌ కుప్పల సాధారణ దృశ్యాలు నేడు కనిపించడంలేదు. ఉల్లి మార్కెట్‌లలో నాణ్యత చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ధరలు మాత్రం గణనీయంగా ఉంటున్నాయి.
బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ సూపర్‌మార్కెట్‌లో సేల్స్ అసోసియేట్ మాట్లాడుతూ, “మొన్న కిలో ధర రూ. 69 ఉండగా, నిన్న‌ ఉదయం మేము దానిని రూ. 79కి మార్చాము. ఈ రోజు మరింత పెరిగే అవకాశం ఉంది.” అన్నారు

Blinkit , Zepto, swiggi instamart వంటి ఆన్‌లైన్ కిరాణా డెలివరీ యాప్‌లు ఉల్లిపాయల ధర కిలో దాదాపు రూ. 70 ఉంది.
అయితే రెండు రోజులుగా ఆ యాప్ లలో కూడా ఉల్లి గడ్డ స్టాక్ లేదని చూపిస్తోంది.
రెండు నెలలల క్రితం ఉల్లిగడ్డలు హైదరాబాద్ లో 15 రూపాయలకు కిలో అమ్ముడు పోయింది. త్వరలో ఈ రేటు కిలో 150కి చేరుతుందని అంచనా వేస్తున్నారు.