HomeTelanganaPolitics

బీజేపీకి బిగ్ షాక్ – రాజగోపాల్ రెడ్డి, వివేక్ లు కాంగ్రెస్ లోకి?

బీజేపీకి బిగ్ షాక్ – రాజగోపాల్ రెడ్డి, వివేక్ లు కాంగ్రెస్ లోకి?

కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరి ఉన్న ఎమ్మెల్యే సీటును పోగొట్టుకున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

70 మంది సిట్టింగులకు టిక్కట్లు గ్యారంటీ… BRS తొలి లిస్ట్ విడుదల ఎప్పుడంటే …?
నన్ను గెలిపించకపోతే కుటుంబం అంతా ఆత్మహత్యచేసుకుంటాం … ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్న బీఆరెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి
బీజేపీకి విజయశాంతి రాజీనామా!

కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరి ఉన్న ఎమ్మెల్యే సీటును పోగొట్టుకున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక అతనితో పొసగకపోవడంతో పాటు మరి కొన్ని కారణాలతో బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆరెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కొంత కాలం బీజేపీలో చురుకుగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి, కాంగ్రెస్ పుంజుకోవడంతో బీజేపీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అప్పటి నుంచే ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారని ప్రచారం సాగుతున్నప్పటికీ ఆయన ఆ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున‌ పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం, తాను ఎల్ బీ నగర్ నుంచి, తన భార్య మునుగోడు నుంచి పోటీ చేస్తామన్న ఆయన డిమాండ్ ను బీజేపీ అగ్రనాయకత్వం పెడచెవినపెట్టడంతో రాజగోపాల్ రెడ్డి ఇక బీజేపీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అంతే కాకుండా, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం , కాంగ్రెస్ పుంజుకోవడం కూడా ఆయన నిర్ణయానికి కారణమైనట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని తనను మునుగోడు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని చెప్పారు. మునుగోడులో ఉప ఎన్నిక సమయానికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయని అన్నారు.

రాజగోపాల్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఆ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

ఇక మరో బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ కూడా పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం బండి సంజయ్ ని తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ పదవిని కిషన్ రెడ్డికి కట్టబెట్టినప్పటి నుంచి వివేక్ అసంత్రుప్తిగానే ఉన్నారు. పైగా బీజేపీ ప్రకటించిన మొదటి లిస్ట్ లో ఆయన పేరు లేక పోవడం, బీజేపీ తరపున పోటీ చేశ్తే గెలిచే అవకాశాలు సన్నగిల్లడం కూడా అయనను కాంగ్రెస్ వైపు చూసేట్టుగా చేస్తున్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు.