HomeNational

లడక్ ‍‍- కార్గిల్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన‌ ఓటర్లు… కాంగ్రెస్, NC కూటమి ఘన విజయం

లడక్ ‍‍- కార్గిల్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించిన‌ ఓటర్లు… కాంగ్రెస్, NC కూటమి ఘన విజయం

ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370ని రద్దు చేసి, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు తర్వాత కార్గిల్‌లో జరిగిన తొలి కీలక ఎన్నికలకు ఆదివారం కౌంటింగ్ జరిగింది.

పేటీఎం ఆ సేవలు రద్దు .రిజర్వ్ బ్యాంక్ తీవ్ర చర్యలు.
ఇండియానా లేక భారతా? పేరు మార్చడం సరి కాదని 2016లో సుప్రీంకోర్టుకు చెప్పిన మోడీ సర్కార్
అల్లెగ్రో పరిశోధన కేంద్రం ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370ని రద్దు చేసి, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు తర్వాత కార్గిల్‌లో జరిగిన తొలి కీలక ఎన్నికలకు ఆదివారం కౌంటింగ్ జరిగింది. 26 మంది సభ్యుల లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్-కార్గిల్‌కు జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి 22 స్థానాలను కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. మరో 2 సీట్లు ఇండిపెండెంట్ లు గెల్చుకున్నారు.

అక్టోబరు 4న ఎన్నికలు జరిగిన LAHDC-కార్గిల్‌లోని 26 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, BJPల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. NC , కాంగ్రెస్ ఎన్నికలకు ముందు కూటమిని ప్రకటించినప్పటికీ నేషనల్ కాన్ఫరెన్స్ 17, కాంగ్రెస్ 22 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. అయితే ఈ రెండు పార్టీల స్నేహ పూర్వక పోటీ వల్ల మరో సీటును చేజేతులా పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఇరు పార్టీల నేతలు వాపోతున్నారు.

95,388 మంది ఓటర్లలో 74,026 మంది తమ హక్కును వినియోగించుకోవడంతో 77.61 శాతం పోలింగ్ నమోదైంది. NC నాయకుడు ఫిరోజ్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని ప్రస్తుత కౌన్సిల్ తన ఐదేళ్ల పదవీకాలాన్ని అక్టోబర్ 1 న పూర్తి చేసింది.

LAHDC పోల్ ఫలితాలు: సీట్ల వారీగా బ్రేక్-అప్
30 మంది సభ్యులున్న LAHDCలో నలుగురు సభ్యులను గవర్నర్ నామినేట్ చేయగా, 26 స్థానాలకు అక్టోబర్ 4న ఎన్నికలు జరిగాయి.

26 స్థానాలకు ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్‌సి 12 స్థానాలను, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌కు 10 సీట్లు లభించగా, బిజెపి, స్వతంత్ర అభ్యర్థులు చెరో 2 స్థానాలను గెలుచుకున్నారు.

గత ఎన్నికల్లో ఒక సీటు గెలిచి, ఇద్దరు పీడీపీ కౌన్సిలర్లు చేరడంతో ఆ సంఖ్య మూడుకు చేరిన బీజేపీ ఈసారి 17 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా, 25 మంది స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. 278 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన మండలి ఎన్నికలకు తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు.

కాగా, జమ్మూ, కాశ్మీర్, లడఖ్ రాష్ట్రాన్ని ప్రజల అనుమతి లేకుండానే ఆర్టికల్ 370ని రద్దు చేసి, అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా విభజించిన శక్తులకు, పార్టీలకు ఈ ఫలితం గొప్ప సందేశాన్ని పంపుతుందని జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అన్నారు.