వరల్డ్ కప్ 2023 లో ఇండియా బోణీ అధిరిపోయింది. ఆదివారం నాడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఇండియా అద్భుత విజయం సాధించింది.
వరల్డ్ కప్ 2023 లో ఇండియా బోణీ అధిరిపోయింది. ఆదివారం నాడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఇండియా అద్భుత విజయం సాధించింది.
ఇండియా బౌలర్లు ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు విజయవంతంగా పరిమితం చేయగా, విరాట్ కోహ్లీ (85), కెఎల్ రాహుల్ (97) పరుగు లు చేసి 41.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకొని ఇండియాకు విజయం సాధించి పెట్టారు.
మొదట కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లతో కలిసి కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను కోహ్లి, రాహుల్ 150+ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఆదుకున్నారు.
కాగా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లతో కూడిన భారత స్పిన్ త్రయం ఆస్ట్రేలియాను 49.3 ఓవర్లలో 199/10 స్కోరుకు పరిమితం చేయడం ద్వారాఇండియా గెలుపుకు దారులు వేశారు. జడేజా 28 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, ఆర్దిక్ పాండ్యా, అడం జంపా ఒక్కొటి చొప్పున వికెట్లు తీసుకున్నారు.