HomeTelanganaPolitics

కాంగ్రెస్: 70 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ , 30 సీట్లలో తీవ్ర పోటీ

కాంగ్రెస్: 70 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ , 30 సీట్లలో తీవ్ర పోటీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అధికార బారత రాష్ట్ర సమితి BRS ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థుఒలను ప్రకటిం

కాంగ్రెస్ లో సెకండ్ లిస్ట్ చిచ్చు…రాజీనామాలు, ఏడుపులు, శాపనార్దాలు
మధుయాష్కీ, పొంగులేటికి కాంగ్రెస్ లో కీలక పదవులు
55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అధికార బారత రాష్ట్ర సమితి BRS ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థుఒలను ప్రకటించగా, కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ఫైనల్ చేయడంలో తలమునకలయ్యాయి.

కాంగ్రెస్ పార్టీలో టిక్క‌ట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండగా అభ్యర్థులను ఫైనల్ చేయడానికి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఒకవైపు ఎన్నికల్ కమిటీ సమావేశం జరుగుతుండగా, తమకు సీట్లు ఇవ్వాలంటూ, ఓబీసీ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఢిల్లీలో ధర్నాకు దిగారు.

ఇక కమిటీ సమావేశం 8 గంటలపాటు సాగింది. అందులో దాదాపు 70 స్థానాలకు అభ్యర్థుల పట్ల ఏకాభిప్రాయం వచ్చినట్టు సమాచారం. కాగా మరో 30 సీట్లలో పోటీ తీవ్రంగా ఉండటంతో ఆ స్థానాల విషయంలో సమావేశంలో తీవ్ర చర్చజరిగినట్టు తెలుస్తోంది. అయితే కమిటీ ఏకాభిప్రాయానికి రాలేదు.

పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలు:

వనపర్తి: మేఘారెడ్డి, చిన్నారెడ్డి
దేవరకద్ర: కొత్తకోట సిద్దార్థరెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి
మక్తల్‌: పర్ణికారెడ్డి, శ్రీహరి ముదిరాజ్‌
కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు, డాక్టర్ కేతూరి వెంకటేష్
గద్వాల: సరిత, కురువ విజయ్
జనగామ: కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య
స్టేషన్‌ ఘన్‌పూర్‌:సింగాపురం ఇందిర, మరో నేత
మహబూబాబాద్‌: బలరాం నాయక్‌, మురళీ నాయక్‌
డోర్నకల్‌: రామచంద్రనాయక్‌, నెహ్రూ నాయక్‌,
వరంగల్‌ వెస్ట్‌: నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి
పరకాల:కొండా మురళి, ఇనగాల వెంకట్రామిరెడ్డి
తుంగతుర్తి: డాక్టర్‌ రవి, పిడమర్తి రవి
దేవరకొండ: బాలు నాయక్, ప్రవళిక కిషన్ నాయక్
మునుగోడు: కృష్ణా రెడ్డి, పున్న కైలాష్ నేత, స్రవంతి రెడ్డి
సత్తుపల్లి: సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్
రామగుండం: హర్కార వేణుగోపాల్‌, రాజ్‌ ఠాకూర్‌
హుజూరాబాద్‌: బల్మూరు వెంకట్‌, వడితెల ప్రణవ్‌
హుస్నాబాద్‌: పొన్నం ప్రభాకర్‌, మరో నేత
కరీంనగర్‌: జైపాల్‌రెడ్డి, పురుమళ్ల శ్రీనివాస్‌, కె. నరేందర్‌రెడ్డి
చొప్పదండి: మేడిపల్లి సత్యం, సత్తు మల్లేశం
దుబ్బాక: చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, కత్తి కార్తీక
నర్సాపూర్‌: ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్‌ కుమార్‌
ఖైరతాబాద్‌: విజయారెడ్డి, రోహిన్‌రెడ్డి
జూబ్లీహిల్స్‌: అజరుద్దీన్‌, విష్ణు
కూకట్‌పల్లి: సతీష్‌, మురళి, గొట్టిముక్కల వెంగళ్‌రావు