HomeTelangana

తెలంగాణలో కమ్మోళ్ళకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలట‌

తెలంగాణలో కమ్మోళ్ళకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలట‌

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి అధిక సీట్లు కేటాయించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ

ఎన్డీయే Vs ఇండియా.. బీజేపీకి దేశభక్తితోనే చెక్ పెట్టబోతున్న కాంగ్రెస్!
తెలంగాణలో కారుదే జోరు – స్పష్టం చేసిన తాజా సర్వే రిపోర్ట్స్
కాంగ్రెస్ కార్యకర్తల‌ను కాల్చి పడేస్తానన్న బీఆరెస్ ఎమ్మెల్యే

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి అధిక సీట్లు కేటాయించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్ కలిసి వినతి పత్రం సమర్పించారు.

తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం అధికసంఖ్యలో ఉన్నదని , ఒక్క ఖమ్మంజిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్త‍ంగా కమ్మ కులస్తులు విస్తరించి ఉన్నారని అ‍ందువల్ల టిక్కట్ల కేటాయింపులో కమ్మ వాళ్ళకు సముచిత స్థానం కల్పించాలని రేణుకా చౌదరి కోరారు. ఇదే విషయంపై మరింత మంది కాంగ్రెస్ అగ్రనేతలను కలవడానికి మరో 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటామని8 ఆమెచెప్పారు. ఆమెతో పాటు కమ్మ కులానికి చెందిహ్న పలువురు కమ్మ నాయకులు కూడా మురళీధరన్ ను కలిశారు.

కమ్మ కులానికి ఎక్కువ అసెంబ్లీ సీట్లు సాధించడం కోసం అందరు నాయకులను కలుస్తామని ఇది తమ ప్లాన్మ్ ఏ అని, తమకు ప్లాన్ బీ కూడా ఉందని అయితే అదేంటో ఇప్పుడే వెల్లడించబోమని రెణూకా చౌదరి మీడియాకు చెప్పారు.

ఖమ్మంలో ఆమెకు కూడా టికట్ వస్తుందో రాదో అనే అనుమానాలున్న నేపథ్యంలో రేణుకా చౌదరి పలువురు కమ్మ వాళ్ళను తీసుకొని ఢిల్లీ పర్యటించడం ఆసక్తిని కలిగిస్తోంది.