HomeTelanganaUncategorized

ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభించనున్న సీఎం కెసిఆర్.భారీ‌ బహిరంగ సభ నిర్వహణ

ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్  ప్రారంభించనున్న సీఎం కెసిఆర్.భారీ‌ బహిరంగ సభ నిర్వహణ

ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం ప్రారంభించనున్న సీఎం కెసిఆర్ భారీ‌ బహిరంగ సభ నిర్వహణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు

కేసీఆర్ తో భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ భేటీ… తమ పార్టీ మహాసభలకు ఛీఫ్ గెస్ట్ గా రావాలని విజ్ఞప్తి
GHMC పరిథిలో విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు రేపు,ఎల్లుండి సెలవులు
కేసీఆర్ నిర్ణయం…ఆనందంలో VRA లు

ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం

ప్రారంభించనున్న సీఎం కెసిఆర్

భారీ‌ బహిరంగ సభ నిర్వహణ

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారి అధ్యక్షతన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో… పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం” ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం చేస్తారు.
నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సిద్ధమైంది.2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటి ఎత్తిపోత జరగనుంది.
ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సీఎం కేసీఆర్ నిర్వహించనున్నారు.
అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహణ జరుగుతుంది.

ఈ బహిరంగ సభకు పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17 న ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల లోని ప్రతీ గ్రామంలో దేవుళ్ళ పాదాలకు గ్రామ సర్పంచులు, ప్రజలు అభిషేకం చేస్తారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించు కోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఇది దక్షిణ తెలంగాణ కు పండుగ రోజు అని సిఎం కేసీఆర్ అన్నారు.

ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషి తో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందని సీఎం కేసీఆర్ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని,పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు – సీఎం తెలిపారు.పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు,
సాగునీరు అందనున్నది.
బంగారి తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నది ఈ సందర్భంగా,సీఎం కేసీఆర్అన్నారు.ఈ సమీక్షలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈలు తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.
వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీలు రంజిత్ రెడ్డి , పోతగంటి రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, కసిరెడ్డి నారాయణరెడ్డి, దయానంద్ గుప్తా, ఎమ్మెల్యేలు అబ్రహం, అంజయ్య, మెతుకు ఆనంద్, నరేందర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జీవన్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి, గువ్వల బాలరాజు , కాలె యాదయ్య, స్పోర్ట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ కమిషనర్ ఇంతియాజ్ ఇషాక్, టిఎస్ జిసిసి ఛైర్మన్ రమావత్ వల్యా నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, సీఎంఓ అధికారులు స్మిత సభార్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే , ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు, సీఈలు రమణారెడ్డి, పెంటారెడ్డి, ఇతర ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.