HomeTelangana

హైదరాబాద్ లో విద్యాసంస్థలకు ఈ రోజు సెలవు

హైదరాబాద్ లో విద్యాసంస్థలకు ఈ రోజు సెలవు

హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత

గాంధీ మార్గాన్ని అంద‌రూ అనుస‌రించాలి
మహిళా విద్యార్థులకు ఎమ్మెల్సీ కవిత కుమారుల చేయూత.. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఉల్లిగడ్డ ధర మండిపోతోంది

హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది.

“ముఖ్యమైన ప్రకటన: హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన నేపథ్యంలో, హైదరాబాద్‌లోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం ఈ రోజు సెలవు ప్రకటించింది. ఇంట్లోనే ఉండండి మరియు సురక్షితంగా ఉండండి.” అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

మేడ్చల్ జిల్లాలోని పాఠశాలలకు పంపిన సందేశంలో మేడ్చల్ డీఈవో, విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే, ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు కార్యక్రమం ఈరోజు కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు.

విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, స్థానిక పరిస్థితుల ఆధారంగా ఆయా జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను కోరినట్లు తెలిపారు.