HomeTelanganaUncategorized

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరసన 

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరసన 

నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న పగిడికత్తుల నాగేశ్వరరావు  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరసన  పాలేరు సెప్టెంబర్ 2(నినాదం

ఖమ్మంలో బీఆర్ఎస్‌కు వరుస ఝలక్‌లు.. పార్టీ తరపున టికెట్ నిరాకరించిన గుమ్మడి నర్సయ్య కుమార్తె!
‘కవితకు ఈడీ నోటీసులు పెద్ద డ్రామా’
యాదాద్రి వద్ద రైల్లో మంటలు… కిందికి దూకి పరుగులు పెట్టిన ప్రయాణీకులు

నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న పగిడికత్తుల నాగేశ్వరరావు 

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరసన 

పాలేరు సెప్టెంబర్ 2(నినాదం న్యూస్)

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం సిపిఎం కోరట్లగూడెం జోన్ పరిధిలోని కోరట్లగూడెం, కోనాయిగూడెం గ్రామాలలో పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జోన్ కమిటీ కన్వీనర్ పగిడికత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యవసర ధరల భారంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలతో సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదన్నారు. ఆదాయం మూరెడు అప్పులు బారెడుగా పేదల పరిస్థితి దాపురించిందన్నారు. అనేక వ్యయప్రయాసల కోర్చి ఉన్నత చదువులు అభ్యసించిన నిరుద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించకపోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. పేదలు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని దోచిపెడుతూ వారికి ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా సామాన్య మధ్యతరగతి ప్రజల సమస్యలపై స్పందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు, ఇళ్ల స్థలాలు మంజూరి చేయాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, పెంచిన నిత్యవసర ధరలను తక్షణమే తగ్గించాలని, లేనియెడల రానున్న కాలంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఉద్యమాలను రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు డేగల వెంకటేశ్వరరావు, బండి రామమూర్తి, శాఖ కార్యదర్శులు గురజాల వెంకటేశ్వర్లు, బోయినపల్లి కొండలరావు,  గురజాల ఉపేందర్, డేగల హరి ప్రసాద్, సిరికొండ వెంకట్రావమ్మ, మంకెనపల్లి క్రాంతి కిరణ్, గాదె వెంకటేశ్వర్లు, మంకెనపల్లి నరసింహారావు, చల్లగొండ రమేష్, షేక్ రియాజ్, పార్టీ సీనియర్ నాయకులు బోయినపల్లి వీరయ్య, బొడ్డు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వాళ్ళు పార్టీల నాయకులు సంపూర్ణ సంఘీభావం తెలియజేశారు.