HomeTelanganaUncategorized

ఈవ్‌ టీజింగ్‌ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి

ఈవ్‌ టీజింగ్‌ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ఆర్మూర్ గర్ల్స్ 1 లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు ఈవ్‌ టీజింగ్‌ చేస్తే షీ టీంకు సమాచారం ఇ

కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు…ఒక్క సీటులో కూడా బీజేపీకి డిపాజిట్ రాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
శ్రీమయి గ్రాండ్ పై టాస్క్ ఫోర్స్ ఆకస్మికదాడి: అరెస్ట్
తెలంగాణకు ఇచ్చిన హామీలేమయ్యాయి – మోడీకి కేటీఆర్ సూటి ప్రశ్న‌

తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ఆర్మూర్ గర్ల్స్ 1 లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు

ఈవ్‌ టీజింగ్‌ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి
ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్‌ టీజింగ్‌ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని షీ టీం కానిస్టేబుళ్లు, విగ్నేష్‌, సుమతి అన్నారు. మైనారిటీ గర్ల్స్ కాలేజ్ అండ్ స్కూల్ పెర్కిట్ మరియు ఆర్మూర్‌ల నందు సైబర్‌ క్రైమ్‌ సైబర్ క్రైమ్ గురించి విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైతే పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్‌ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు.
షీ టీం నెంబర్‌ 8712659795కు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. అనంతరం షీ టీం కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, నహీదా ఫిరోజ్ మేడం అధ్యాపకులు, విద్యార్థినిలు సుమారు 250 నుండి300 వరకు పాల్గొన్నారు.