ఆంధ్రప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తెలంగాణలో గ్రంధాలయల కంటే వైన్ షాపులే ఎక్కువ… కరీంనగర్: తెలంగాణా రాష్ట్రంలో జ్ఞానాన్ని పం
ఆంధ్రప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్
తెలంగాణలో గ్రంధాలయల కంటే వైన్ షాపులే ఎక్కువ…
కరీంనగర్: తెలంగాణా రాష్ట్రంలో జ్ఞానాన్ని పంచే గ్రంధాలయలకంటే బ్రాందీ షాపులే ఎక్కువని ఏపీ ప్రభుత్వ మీడియా సలహా దారులు దేవులపల్లి అమర్ అన్నారు. బోయినపల్లి వెంకట రామారావు (బొవేరా) 103వ జయంతి స్మారకోపన్యాసం సందర్భంగా కరీంనగర్ నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అమర్ మాట్లాడుతూ ఎవరేం అనుకున్నా మలిదశ తెలంగాణ సాధన ఉద్యమంలో నా వంతు పాత్ర పోషించానని అన్నారు. కరీంనగర్ లో తాను పని చేసిన సమయంలో బోవేరా ను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. బోవేరా చివరి క్షణాల వరకు ప్రజల కోసం పనిచేశారని ఆయన బాటను రేపటి తరం అనుసరించాలని అన్నారు.
తాను ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదని అంటూనే కేసీఆర్ ప్రభుత్వం పై చురక అంటించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులుగా రాష్ట్ర తొలి శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి వ్యవహరించారు. బోవేరా కుమారుడు బోయినపల్లి హనుమంతరావు స్వాగతోపన్యాసం చేశారు.ఈ కార్యక్రమంలో విమలక్కకు ప్రజాయుద్ధ శతాగ్ని అవార్డ్ తో సత్కరించారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, శాతవాహన యూనివర్సిటీ వీసీ మల్లేష్, ప్రజాగాయకురాలు విమలక్క, పృద్విరాజ్ లు పాల్గొన్నారు.