HomeTelangana

ఆరోగ్య చేవెళ్ళ ఒక విప్లవం!

ఆరోగ్య చేవెళ్ళ ఒక విప్లవం!

వైద్యో నారాయణా అని ఉద్ఘాటిస్తాం. అంటే వైద్యం చేసే వారిని హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం దేవుడని ప్రస్తుతించడం ఆ పదబంధాల అర్థం. అంత పవిత్రమైనదా వృత్తి.

బీజేపీలో మల్కాజిగిరి రాజకీయం.. ఆ సీటుపై కన్నేసిన ఈటల… ఆయనకు రాకుండా చక్రం తిప్పుతున్న బండి
ధర్మపురి అరవింద్ కు కార్యకర్తల షాక్.. రాష్ట్ర BJP ఆఫీస్ లో రచ్చ రచ్చ‌
తెలంగాణ గవర్నర్ తమిళిసై MPగా పోటీ చేయనున్నారా ?

వైద్యో నారాయణా అని ఉద్ఘాటిస్తాం. అంటే వైద్యం చేసే వారిని హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం దేవుడని ప్రస్తుతించడం ఆ పదబంధాల అర్థం. అంత పవిత్రమైనదా వృత్తి. అంతటి మహాత్తరమైన వైద్య సేవలు నేడు అందని ద్రాక్ష మారిన సందర్భంలో… ఒక నాయకుడు ఇంటింటికి వైద్యం… గడప గడపకి ఆరోగ్య రథం” అనే సేవా కార్యక్రమాన్ని తన పార్లమెంట్​ నియోజకవర్గంలో స్వచ్ఛంధంగా… ఉచితంగా చేపడితే ఏమనాలి? ఒక హిందీ సినిమాలో చెప్పినట్టు… రాజకీయ నాయకుడంటే… ల్యాండ్​ గ్రాబింగ్​… స్యాండ్​ మైనింగ్, ధన దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గపు దుష్టాంతాలు చేయాలన్న అభిప్రాయానికి సగటు జనమంతా వచ్చిన నేటి తరుణంలో ఆ నాయకుడు… తనకు అండగా నిలిచిన జనం కోసం ఒక సేవా కార్యక్రమాన్ని తలకెత్తుకుంటే మరేమని సంబోధించాలి? నాయకుడు లేని సమాజాన్ని సృష్టించడమే నిజమైన నాయకుడి లక్ష్యమనే సోషలిస్టు సిద్ధాంతపు మాటలను నిజం చేస్తే ఆయన్ను ప్రజా నాయకుడని వ్యాఖ్యానించకుండా ఉండలేం. మనకాలపు మహనీయుడని ఉద్ఘాటించకుండా సమయం గడపలేం. నేను చెబుతున్న ఆ నాయకుడు మరే ఎవరో కాదు… చేవెళ్ళ ఎంపీ డాక్టర్​ జి.రంజిత్​రెడ్డి గారి గురించే. ఒక వెటర్నరీ డాక్టర్​గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి… హెచరీస్​ రంగంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఆయన… ప్రజా సేవా చేయాలన్న సంకల్పంతో 2019లో రాజకీయాల్లో వచ్చారు. అప్పుడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్ సూచన మేరకు చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసి… రాజకీయాలే ఆలంబన బతికిన కుటుంబ నేపథ్యం కల్గిన వ్యక్తిని ఆ ఎన్నికల్లో మట్టి కరిపించారు. సరే ఇక, 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో గెలిచాం కదా. ఇంకేం మన పదవిని మనం ఎంజాయ్​ చేద్దాం అన్న సహజ ధోరణిని వీడనాడి, నిత్యం ప్రజల్లో ఉంటూ… వారి ప్రతి పనిలో అందుబాటులో ఉండటం ద్వారా రంజిత్​రెడ్డి తన మార్కు రాజకీయాన్ని ఏంటో విశదీకరించారు. తనకు విద్యాబుద్ధులు నేర్పించడంలో ఎంతగానో కష్టపడి, పరితపించిన తన తండ్రి రాజారెడ్డి సంస్మారణార్థం… తన సతీమణి సీతా రెడ్డి నేతృత్వంలో సాగే ఆర్​ఆర్​ ఫౌండేషన్​ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు… నిర్వహిస్తూనే ఉన్నారు. వందలాది మంది వికలాంగులకు ట్రై సైకిల్స్​, పేదల ఆరోగ్యానికి వందలాది అంబులెన్సెలు​ అందజేసి తనలో మానవీయతను చాటుకున్నారు. ఇక కరోనా సమయంలో స్కూల్స్​ నడపలేమని ప్రభుత్వమే చేతులెత్తేసి చెప్పేసినప్పుడు… విద్య విలువ తెలిసిన ఒక బాధ్యతగల నేతగా తన పార్లమెంట్​ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ విద్యార్థికి చదువుకు ఇబ్బంది లేకుండా చేశారు. ప్రభుత్వ స్కూలు పిల్లలు ఆ టీవీల ద్వారా పాఠాలు వినాలని ప్రయత్నించిన నిఖార్సైన నాయకుడాయన. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా… కనీస సమయం ఇవ్వకుండా విధించిన లాక్​డౌన్​లో పేద ప్రజలు, వలస కార్మికులు ఇబ్బంది పడకుండా ఉండాలని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమంది రేషన్​ సరకులు, ఆహార పొట్లాలు స్వయంగా తయారు చేయించి అందజేశారు. ఇటీవల కాలంలో కూడా చేవెళ్ళ పరిధిలోని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్​లు… వీధి వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. ఇవన్నీ చేసినా ఆయనలో ఎక్కడో ఒక సంతృప్తి లేనితనం… ఏదో మూలన ఒక అసంతృప్తి నెలకొంది. అది ఆయన్ని బలంగా ఆవాహన చేసింది. ఆ ఆలోచన నుంచే పుట్టిందే ఈ చేవెళ్ళ ఆరోగ్య రథ కార్యక్రమం. ప్రభుత్వమైనా… ప్రజాప్రతినిధి అయినా ఆసుపత్రులు కట్టించడం విన్నాం…. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించడం చూశాం. కానీ, ఆసుపత్రి స్వరూపం ఉన్న ఒక బస్సును తయారు చేయించి… పేద ప్రజలు ఉండే గ్రామాలు… బస్తీలకు పంపి వారికి ఆరోగ్య పరీక్షలు చేయించడం నిజంగా ఎంతో సాహసోపేతమైన విషయం. పేద ప్రజలు ఉండే ప్రదేశానికి వైద్యులు, పారామెడికల్​ సిబ్బంది, సపోర్టింగ్​ స్టాఫును తీసువెళ్ళి సేవలు అందించడం ఒక బృహత్తరమైన కార్యం. అటువంటి భారీ స్థాయి కార్యక్రమాన్ని అమలు చేసేప్పుడు వచ్చే ఇబ్బందులకు సంబంధిత టీంకు ఆయన ఇచ్చే ప్రోత్సాహం నిజంగా మరవలేనిది. తెలంగాణ రాజకీయ యవనికపై ఎన్నికలు అంటే…. లిక్కర్​ ఇచ్చి… నోట్లు పంచితే ఓట్లు పడతాయన్న సూత్రానికి తిలోదికాలు ఇచ్చి… రాజకీయం అంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, వారు అడిగిన అభివృద్ధి చేయడమని నిరూపించిన వ్యక్తి చేవెళ్ళ ఎంపీ డాక్టర్​ జి.రంజిత్​రెడ్డి. ఇప్పటివరకు 20 గ్రామాల్లో 22 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో దాదాపు 6,500 మంది వరకు వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి ఉచిత వైద్య సేవలు అందించాలని ధ్యేయంతో ముందుకు సాగుతున్నది. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పొందుతూ షుగర్​, బీపీ పరీక్షలను స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చేయించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కవ మంది బీపీ, షుగర్​, హై కొలెస్ట్రాల్​ వంటి లైఫ్​ స్టైల్​ రోగాలు ఉన్నా, ఆ విషయం వారికి తెలిసి రావడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా అవగాహనకు వస్తున్నాయి. దాంతోపాటు, ఇక్కడ తెలియవలిసిన ముఖ్య విషయం ఏమిటింటే… ఆరోగ్య రథ కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు నాయకులు కూడా టెస్టు చేయించుకుంటే… చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కూడా బీపీ రెండు వేర్వేరు సందర్భాల్లో ఎక్కువగా నమోదు అయిందంటే మనలోని చాలామంది ఆరోగ్యమంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో అవగతం చేసుకోవచ్చు. అయితే, ఈ నిర్లక్ష్యాన్ని నిలువునా ఖండించాలని… ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధతో ఉండాలన్న సంకల్పంలో భాగంగా రంజిత్​రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. నాయకుడుంటే… తనను నమ్ముకున్న జనాలకు నరకం చూపించేవాడు కాదని…. తనవాళ్ళ నడకలో… నడవడికలో నిత్యం నాలుగు అడుగులు కలిపేవాడన్న కొత్త అర్థాన్ని… సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన చేవెళ్ళ ఎంపీ రంజిత్​రెడ్డిని అక్కడి ప్రజానీకం ప్రతి సందర్భంలో కడుపులో పెట్టుకొని చూసుకోవాలని ఆకాంక్షిస్తూ… ఆశిస్తూ!

తెలంగాణ పోరాటం, స్వరాష్ట సిద్ధించడం కంటే ముందు… సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వైద్య రంగం ప్రత్యేక రాష్ట్ర సాధనతో సీఎం కేసీఆర్​ నేతృత్వాన తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి లాంటి విపత్తును తట్టుకునేందుకు రూపొందించబడిన వ్యాక్సిన్​ మన హైదరాబాద్​ గడ్డ నుంచే తయారు కావడమంటే… వైద్య విద్య పరిశోధనలో ప్రపంచం కంటే ఎంత ముందు మనం ఉన్నామనే విషయం బోధపరుస్తున్న అంశం. కేంద్రంలోని మోడీ సర్కారు ఒక్క పైసా ఇవ్వకపోయినా… ఆర్థిక ఇబ్బందులున్నా ఈ తొమ్మిదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా మెడికల్​ కాలేజీలు జిల్లాకు ఒకటి కడుతూ… ఆసుపత్రులను నిర్మిస్తూ ప్రజారోగ్యం కోసం నిరంతరం పాటుపడుతున్నది. కేసీఆర్​ సర్కారు వైద్య అనుకూల విధానాలతో తెలంగాణ ఒక మెడికల్​ హబ్​గా దేశంలో అలరారుతున్నది. 60 ఏండ్ల సమైక్య పాలనలో ఒక్కటంటే ఒక్క సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను రాష్ట్రంలో నిర్మించలేదు. నిజాం కాలంలో నిర్మించిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌, నీలోఫర్‌ దవాఖానాలే తెలంగాణ ప్రజల్ని ఆదుకున్నాయి. నియోజకవర్గ స్థాయిలో అత్యవసర సేవలు, ఐసీయూ వార్డులు, వైద్య పరికరాలు, డాక్టర్లు లేక ప్రజలు వందలాది కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు రావాల్సి వచ్చేది. సకాలంలో వైద్యం అందక మార్గమధ్యంలో మరణించిన సంఘటనలు కోకొల్లలు. మనుషుల ప్రాణాల విలువ తెలిసిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐసీయూ వార్డులను, ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేసి, ఎంతోమంది ప్రాణాలను పరిరక్షిస్తున్నది. గతంలో రాష్ట్రంలో మూడంటే మూడే డయాలసిస్‌ సెంటర్లు ఉండేవి. నేడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, డయాలసిస్‌ పేషంట్లకు ఆసరా ఫింఛన్‌, ఉచిత బస్‌పాస్‌ను అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 2014 నాటికి, 700 ఎంబిబియస్ సీట్లతో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి (ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ, ఆదిలాబాద్ రిమ్స్). రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో 22 మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండం, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌(చేవెళ్ళ పార్లమెంట్​ సీట్​ పరిధిలోని మెడికల్​ కాలేజీ)లలో మరో ఏర్పాటు చేసింది మన సర్కారు. కేసీఆర్ ప్రభుత్వం సాయంతో వికారాబాద్​లో మెడికల్​ కాలేజీ తెచ్చుకొని… ఈ ప్రాంతానికి దశాబ్ధాల కల నెరవేర్చినట్టయింది. 2014లో 850 మెడికల్​ సీట్లు ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 26 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 4440 మెడికల్ సీట్లు అందుబాటులోకి రావడమంటే తెలంగాణ సర్కారు కృషి ఫలితమే. ప్రభుత్వం ఇన్ని చేసినా… ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. ఆ నిర్లక్ష్యంపై యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సర్వ రోగాలకు… సకల వ్యాధులకు నిర్లక్ష్యమే కారణమని చెప్పాలి. అందుకే, ఆ నిర్లక్ష్యాన్ని నిర్ద్వందంగా నిలువునా దహించివేయాలనే ఈ ఆరోగ్య చేవెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎంపీ రంజిత్​రెడ్డి. ఆ కార్యక్రమ లక్ష్యాలు, ఆశయాలు ఏంటో నేడు యావత్​ చేవెళ్ళ అంతా అనుభవిస్తున్నది. అదే స్ఫూర్తితో మునుముందుకు సాగాలని కోరుకుంటూ!

సాగర్​ వనపర్తి,
సీనియర్​ జర్నలిస్టు,
9494041258.