HomeTelanganaPolitics

మరి కొద్ది సేపట్లో అభ్యర్థుల అనౌన్స్ మెంట్… బీఆరెస్ లో టిక్కట్ల టెన్షన్… వారి కోసం కవిత పైరవీ

మరి కొద్ది సేపట్లో అభ్యర్థుల అనౌన్స్ మెంట్… బీఆరెస్ లో టిక్కట్ల టెన్షన్… వారి కోసం కవిత పైరవీ

తెలంగాణ అసెంబ్లీకి రాబోయే ఎన్నికల్లో బీఆరెస్ తరపున పోటీ చేయబోయే వారి పేర్లను మరి కొద్ది సేపట్లో కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో టికట

BRS వాళ్ళకు తుపాకులు కావాలేమో మేము కంటి చూపుతో చంపేస్తాం… జగ్గారెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు – ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి
వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలిమెడ.!

తెలంగాణ అసెంబ్లీకి రాబోయే ఎన్నికల్లో బీఆరెస్ తరపున పోటీ చేయబోయే వారి పేర్లను మరి కొద్ది సేపట్లో కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో టికట్ ఆశిస్తున్న వారికి టెన్షన్ తో నరాలు చితికిపోతున్నాయి. ఈ సారి కొందరు సిట్టింగులను పక్కనపెట్టి మరొకరికి టికత్ ఇవ్వాలన్న కేసీఆర్ నిర్ణయం పలువురు సిట్టింగుల్లో కలకలం రేపుతోంది. తమకు టికట్ రాదని తేలిపోయిన కొందరు ఈ రోజు ఉదయాన్నే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను, మరికొందరు మంత్రి హరీశ్ రావును కలిసి తమకు ఎలాగైనా టికట్ వచ్చేట్టు కేసీఆర్ కు చెప్పాలని వేడుకున్నారు.

నిన్న, ఇవాళ కల్వకుంట్ల కవితను రేఖా నాయక్, సునీతా లక్ష్మారెడ్డి, ముత్తిరెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, తాతా మధు, మాజీ ఎమ్మెల్యే రత్నంతో పాటు పలువురు సిట్టింగులు, ఆశావహులు కలిశారు. మరోవైపు ఆదివారం రోజు ప్రత్యేకంగా వెళ్లి కవితను కలిసిన బొంతు రామ్మోహన్ ఇవాళ మరోసారి భేటీ అయ్యారు. ఈయన ఉప్పల్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న బేతి సుభాష్ రెడ్డి కూడా కవితతో భేటీ అయ్యారు. అయితే ఈ ఇద్దరికీ కాకుండా మరో కీలక నేతకు టికెట్ ఇచ్చేసినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఉద్యమ కారులకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఇల్లందు, సంగారెడ్డి, స్టేషన్ ఘనపూర్ నేతలు హరీష్ రావును కలిశారు.

వీరందరి విన్నపాలు విన్న కవిత, హరీశ్ రావులు వారి లిస్ట్ ను తీసుకొని ప్రగతి భవన్ వెళ్ళారు. వీళ్ళిద్దరూ కేసీఆర్ తో భేటీ అయ్యారు. నిన్నటి నుంచి తమ‌కు వచ్చిన విన్నపాలను కేసీఆర్‌ ముందు ఉంచబోతున్నారు. మరో సారి ఈ పేర్లను పరిశీలించాలని కోరే అవకాశం ఉంది . ఇద్దరు నేతలకు టికట్ కోసం కవిత హామీ ఇచ్చిన్బట్టు బీఆరెస్ వర్గాల‌ సమాచారం. అందులో ఒకరు మహిళా నేత కాగా మరొకరు బీఆరెస్ లో కీలకంగా ఉన్న నాయకుడు. వారిద్దరికీ టికట్ విషయంలో కవిత కేసీఆర్ వద్ద పట్టుబట్టే అవకాశం ఉంది. ఏంజరుగుతుందో అనే టెన్షన్ తో వాళ్ళిద్దరూ ప్రగతి భవన్‌ బయటే వేచి చూస్తున్నారు.