HomeNational

రజినీ కాంత్ సౌత్ ఇండియా ఇజ్జత్ తీసేశాడా ?

రజినీ కాంత్ సౌత్ ఇండియా ఇజ్జత్ తీసేశాడా ?

సూపర్ స్టార్ రజినీకాంత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు మొక్కడం చాలా మందిక్జి నచ్చలేదు. శనివారం నాడు రజినీకాంత్ లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ న

వచ్చే నెల సినీ అభిమానులకు పండగే
ఈ మూవీ తెలంగాణలో బీజేపీకి ఓట్లను రాలుస్తుందా ?
రజినీ కాంత్ ‘జైలర్’ మూవీ ఫ‌స్ట్ డే, ఫస్ట్ షో చూసేందుకు జపాన్ నుంచి చెన్నై వచ్చిన జపాన్ దంపతులు

సూపర్ స్టార్ రజినీకాంత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు మొక్కడం చాలా మందిక్జి నచ్చలేదు. శనివారం నాడు రజినీకాంత్ లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఆయన నివాసంలో కలుసుకున్నాడు. ఈ సందర్భంగా యోగి పాదాలకు రజినీ కాంత్ నమస్కరించాడు.

ఈ చర్యపై ట్విట్టర్ లో రజినీ కాంత్ పై విమర్శ్ల వర్షం కురుస్తోంది. ఆయన తమిళనాడు, దక్షిణ భారత దేశం గౌరవాన్ని యొగి పాదాల చెంత పెట్టాడని కొందరు విమర్శించగా ‘‘72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలను తాకడం ఏంటి? మత పరంగా గుడ్డిగా వ్యవహరించినప్పుడే ఇలాంటిది సాధ్యపడుతుంది’’అని అక్షిత్ అనే యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.

‘‘వయసులో 20 ఏళ్ల పెద్ద అయిన రజనీకాంత్ మత విద్వేషాన్ని వ్యాప్తి చేసే సీఎం పాదాలను తాకారు. దక్షిణాది ప్రజలు ఆయనకు ఇచ్చిన గౌరవం రెండు సెకండ్లలో పోయింది. ఫాసిస్టులకు మద్దతు పలికిన వెన్నెముక‌లేని వ్యక్తిగా చరిత్ర ఆయన్ని గుర్తు పెట్టుకుంది’’అని అమీనా అనే యూజర్ పోస్ట్ చేశారు.

ఇది తమిళనాడుకు అవమానకరం.ఈ భూమి రాష్ట్ర ప్రజలు అతనికి ఇచ్చిన ప్రతిదానిని అతను అవమానించాడు అనిమరో యూజర్ కామెంట్ చేశాడు.

”నార్త్ ఇండియా ముందు సౌత్ ఇండియా పరిస్థితి ఇది” అనిమరో యూజర్ కామెంట్ చేయగా రజినీ కాంత్ మొదటి నుంచీ అంధ భక్తుడే అని మరో తెలుగు యూజర్ వ్యాఖ్యానించాడు.

“ఒక గొప్ప స్టార్ తన విలువను తగ్గించుకున్నాడు. ” “ఇది నిజంగా నిరాశపరిచింది” అని మరొకరు రాశారు. “ఈరోజు రజనీ అభిమానులు కళాకారుడిని అత్ని నుండి కళను ఎలా వేరు చేయాలో నేర్చుకుంటారు. ఆల్ ది బెస్ట్” అని మరొక వ్యాఖ్య ఉంది.