HomeInternational

మరో భయంకర బాక్టీరియా… ఇది మనిషి లోని మాంసాన్ని తినేసి చంపేస్తుంది… ముగ్గురి మరణంతో బహిర్గత౦

మరో భయంకర బాక్టీరియా… ఇది మనిషి లోని మాంసాన్ని తినేసి చంపేస్తుంది… ముగ్గురి మరణంతో బహిర్గత౦

కలరాకు కారణమయ్యే బాక్టీరియా కుటుంబం నుండే వచ్చిన విబ్రియో వల్నిఫికస్ అనే బాక్టీరియా మనిషి శరీరంలోకి వెళ్తే క్రమక్రమంగా మనిషిలోని మాంసాన్ని తి

అమెరికా లో పవన్ జన్మదిన వేడుకలు
మొదలైన సంక్షోభం: AI కి వ్యతిరేకంగా పోరాటం షురూ…స్తంభించిన హాలీవుడ్
ఉచిత విధ్యుత్తు వ్యాఖ్యలపై రేవంత్ తొలి స్పందన…ఇకనైనా రచ్చ ఆగేనా?

కలరాకు కారణమయ్యే బాక్టీరియా కుటుంబం నుండే వచ్చిన విబ్రియో వల్నిఫికస్ అనే బాక్టీరియా మనిషి శరీరంలోకి వెళ్తే క్రమక్రమంగా మనిషిలోని మాంసాన్ని తినేసి మనిషిని చంపేస్తుంది. ఈ బాక్టీరియా సముద్ర జలాల్లో ఉంటుంది. ఎక్కువగా ఉప్పునీటిలో నివసిస్తుంది. ఆ నీళ్ళలో ఉండే చేపల శరీరంలోకి వెళ్ళి , ఆ చేపను మనం తిన్నప్పుడు మన్ అశరీరంలోకి ప్రవేశిస్తుంది.

అమెరికాలోని కనెక్టికట్, న్యూయార్క్‌లో కనీసం ముగ్గురు వ్యక్తులు ఈ మాంసం తినే బ్యాక్టీరియా సోకడం వల్ల‌ మరణించారు.ఇది వెచ్చని, ఉప్పునీటిలో లేదా ముడి షెల్‌ఫిష్‌లో కనుగొనబడిందని అధికారులు బుధవారం ధృవీకరించారు.

యునైటెడ్ స్టేట్స్‌లో సముద్రపు ఆహారం వల్ల జర్గే మరణాలకు ఇది ముఖ్య‌ కారణం, జీర్ణం కాని సముద్రపు ఆహారం వల్ల 95% మరణాలు సంభవిస్తాయి.

కనెక్టికట్‌లో, ఇద్దరు వ్యక్తులు వైరస్ బారిన పడ్డారు. వీళ్ళు లాంగ్ ఐలాండ్ సౌండ్‌లోని రెండు వేర్వేరు ప్రదేశాలలో ఈత కొట్టిన తర్వాత మరణించారని కనెక్టికట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ క్రిస్టోఫర్ బాయిల్ చెప్పారు.

మూడవ వ్యక్తికి జూలైలో వ్యాధి సోకింది. సముద్రంలోని ముడి గుల్లలు తినడం వలన ఇతను మరణించాడు. ముగ్గురూ 60 నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల వారేనని శాఖ తెలిపింది.

ఈ బ్యాక్టీరియా న్యూయార్క్ జలాల్లోనే కాక‌ మరెక్కడైనా ఉందా అనే విషయాన్ని నిర్ధారించడానికి పరిశోధనలు చేస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు
జూలై 28న ఒక వార్తా ప్రకటనలో, “ప్రజలు పచ్చి గుల్లలు తినడం, ఉప్పునీటి వల్ల కలిగే ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.” కనెక్టికట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ డాక్టర్ మనీషా జుథాని ప్రజలను హెచ్చరించారు.

“అరుదైనప్పటికీ, విబ్రియో బాక్టీరియా దురదృష్టవశాత్తు మన‌ ప్రాంతానికి చేరుకుంది. ఇది చాలా అసాధారణంగా ప్రమాదకరంగా ఉంటుంది” అని న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ బుధవారం అన్నారు..

ముగ్గురి ప్రాణాలను బలిగొన్న విబ్రియో వల్నిఫికస్ అంటే ఏమిటి
విబ్రియో వల్నిఫికస్, చర్మ గాయాలు, పొక్కులు, పూతలు, కురుపులకు కారణమవుతుంది. దీని లక్షణాలు చలి, జ్వరం, అతిసారం, కడుపు నొప్పి, వాంతులు.

బ్యాక్టీరియాకు గురయ్యామని ఏ మాత్రం అనుమానం వచ్చినా వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు.

శరీరంపై గీసుక పోవడం, కోసుకపోవడం, కత్తి గాట్ల వాళ్ళ కొత్తగా కుట్లు వేయించుకున్నా, పచ్చబొట్లు ఉన్న వ్యక్తులు, తీరప్రాంత పరిసరాలలో సముద్రపు నీటి వద్దకు వెళ్ళవద్దని వార్తా ప్రకటన తెలిపింది.