HomeNational

ఎవరీ కళావతి? ఆమె కోసం కాంగ్రెస్, బీజేపీల రచ్చ ఎందుకు ?

ఎవరీ కళావతి? ఆమె కోసం కాంగ్రెస్, బీజేపీల రచ్చ ఎందుకు ?

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు కళావతి గురించి చేసిన ప్రస్తావన‌ బిజెపి, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చకు ద

నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనంటూ కోర్టు హాల్ లోనే హైకోర్టు జడ్జి రాజీనామా
గౌరీ లంకేష్ ,దభోల్కర్, పన్సారే, కల్బుర్గి, హత్యల వెనక ఉన్నకుట్ర ను పరిశీలించాలని సీబీఐని ఆదేశించిన‌ సుప్రీంకోర్టు
కేసీఆర్ కుటుంబ సభ్యుడు మరొకరికి కీలక పదవి

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతు కళావతి గురించి చేసిన ప్రస్తావన‌ బిజెపి, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 2008లో మహారాష్ట్రకు చెందిన మహిళా రైతు కళావతి అనే మహిళను కలిశారు. పంటలు సరిగా పండక, అప్పులపాలై ఆమె భర్త ఆత్మహత్యచేసుకున్నాడు. ఆ సమయంలో రాహుల్ ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను పరమార్షించారు. అది జరిగిన‌ 15 ఏళ్ల తర్వాత అమిత్ షా ఆ విషయాన్ని గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ పై విమర్శలు గుప్పించారు. అదొక రాజకీయ జిమ్మిక్కుగా అభివర్ణించారు.

“ రాహుల్ గాంధీ భోజనం చేయడానికి వెళ్లిన ఒక పేద మహిళ కళావతి గురించి పార్లమెంటులో ఆయన ప్రస్తావించడం ద్వారా పేదరికాన్ని వివరించాడు. తర్వాత ఆరేళ్లపాటు వారి ప్రభుత్వం (యూపీఏ) అధికారంలో కొనసాగింది. నేను అడగాలనుకుంటున్నాను, మీరు ఆమె కోసం ఏమి చేసారు? ” అని అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

‘‘కళావతికి ఇల్లు, విద్యుత్, గ్యాస్, టాయిలెట్, రేషన్, వైద్యం అందించింది నరేంద్ర మోడీయే. అందువల్ల, మీరు (రాహుల్) ఇంటికి వెళ్లిన కళావతి కూడా మోడీజీని విశ్వసిస్తారు, ”అని అమిత్ షా అన్నారు.
అయితే అమిత్ షా రాహుల్ గాంధీని పార్లమెంటులో ఎగతాళి చేసి కాంగ్రెస్ పై గుగ్లీ విసిరిన కొన్ని గంటల తర్వాత, కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి పై కళావతి మాట్లాడిన వీడియోతో బౌన్సర్ కొట్టింది. ఆ వీడియోలో కళావతి రాహుల్ గాంధీ తమకు చేసిన సహాయాన్ని వివ‌రించింది.
“ మేము ‘కళావతి జీ’ ని గుర్తుంచుకున్నాము. రాహుల్‌ను కలిసిన తర్వాత కళావతి జీవితంలో వచ్చిన మార్పు యావత్ భారతదేశానికి తెలుసు. మీరు కూడా చూడండి… మోడీ జీకి కూడా చూపించండి. కళావతి జీ కథ, ఆమె మాటల్లోనే వినండి” అని అమిత్ షాను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేసింది.

బ్రిటీష్ బ్రాడ్‌కాస్టర్ BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కళావతి తన కష్టాలను వివరించింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో తన సమావేశాన్ని గుర్తుచేసుకుంది. ఆయన చేసిన సహాయాన్ని వివరించింది.

‘‘రాహుల్ గాంధీ నన్ను కలుసుకుని పేదరికం నుంచి బయటపడేట్టు చేశారు. మొదటగా నాకు రూ.3 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత మరో రూ. 30 లక్షలు నా పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేసి నాకు దానిపై వడ్డీ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు’’ అని కళావతి వీడియోలో చెప్పారు.