రజనీకాంత్ పై ఉండే అభిమానానికి హద్దులు లేవు. అతని పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. రాజునీ మూవీ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్ స్కు పండగ వాతావరణమే.
రజనీకాంత్ పై ఉండే అభిమానానికి హద్దులు లేవు. అతని పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. రాజునీ మూవీ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్ స్కు పండగ వాతావరణమే. రజినీ అంటే అభిమానం ఒక్క తమిళనాడుకో, ఇండియాకో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా రజినీ ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ లో అయితే జపానీయులు రజినీ అభిమాన సంఘాలు కూడా ఏర్పాటు చేశారు.
ఈ రోజు విడుదలైన రజినీ కాంత్ మూవీ జైలర్ సంచలనం సృష్టిస్తోంది. ‘జైలర్’కి ఉన్న క్రేజ్ కూడా అదే రుజువు చేస్తోంది.
ఫ్యాన్స్ పటాకులు పేల్చి సూపర్ స్టార్ పోస్టర్‌పై పూలవర్షం కురిపిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన ఓ సంఘటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
రజినీకాంత్ ‘జైలర్’ మూవీని చూడడానికి జపాన్ కు చెందిన ఫ్యాన్ తన భార్యతో కలిసి చెన్నై వచ్చారు. మొదటి రోజు మొదటి షో చూడాలనే కోరికతో తాము చెన్నై వచ్చామని ఆ దంపతులు చెప్పారు.
జపాన్ లో రజినీ కాంత్ ఫ్యాన్స్ క్లబ్ నాయకుడైన యసుదా హిడెతోషి తన భార్యతో కలిసి ఒసాకా నుండి చెన్నై వచ్చారు. వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ రజినీ కాంత్ మూవీ చూడడానికే తాము జపాన్ నుంచి చెన్నై వచ్చామన్నారు. వాళ్ళు మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.
కాగా, రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘జైలర్’ మూవీ ఈ రోజు( ఆగస్ట్ 10న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా అతిధి పాత్రలు పోషించారు. జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ, తమన్నా, వినాయకన్ తో సహా పలువురు ఇతర తారాగణం నటించారు. ‘జైలర్’ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ‘కావాలా’, ‘హుకుం’ అనే రెండు పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.
VIDEO | A Japanese couple has travelled from Osaka to Chennai, Tamil Nadu to watch Rajinikanth's new film 'Jailer'.
— Press Trust of India (@PTI_News) August 10, 2023
"To see the Jailer movie, we have come from Japan to Chennai," says Yasuda Hidetoshi, Rajinikanth fan club leader, Japan. pic.twitter.com/04ACrc4Q5c