HomeTelangana

గద్దర్ మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం

గద్దర్ మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం

గద్దర్ మరణం పట్ల సీపీఐ మావోయిస్టు సంతాపం వ్యక్తం చేసింది. గుండెకు ఆపరేషన్ ఫెయిల్ అయి మృతి చెందినట్లు మీడియా ద్వారా విన్నామని, తన మరణం రాష్ట్ర ప్రజలంద

మావోయిస్టుల‌ దాడి, 35మంది భద్రతా సిబ్బంది, ముగ్గురు మావోయిస్టుల‌ మృతి ‍- మావోయిస్టు పార్టీ ప్రకటన‌
హైదరాబాద్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర‌ కమిటీ నాయకుడి అరెస్ట్ ?
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌

గద్దర్ మరణం పట్ల సీపీఐ మావోయిస్టు సంతాపం వ్యక్తం చేసింది. గుండెకు ఆపరేషన్ ఫెయిల్ అయి మృతి చెందినట్లు మీడియా ద్వారా విన్నామని, తన మరణం రాష్ట్ర ప్రజలందరికి ఆవేదనను కలిగించిందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికారప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

”గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.
నగ్జల్బరి, శ్రీకాకులం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వామ్య‌ వ్యతిరేక పోరాటాల నేపధ్యంలో పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాల్లో సమీకరించాడానికి సిపిఐ (ఎంఎల్) పార్టీ సాంస్కృతికి బృంధాన్ని ఏర్పర్చింది. మొదట్లో ఆర్ట్స్ ల‌వర్స్ ఆతరువాత 1972లో జన నాట్య మండలిని నిర్మించింది. జన నాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి వుంది. 1972 నుండి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగింది. 4 దశబ్దాలు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డాడు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)లో పార్టీ సభ్యుడిగా సాంస్కృతి రంగంలో పనిచేస్తూ. విప్లవోద్యమ నిర్మాణంలో విశేష కృషి చేశాడు. 1972 నుండి 2012 దాకా మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగాడు. తను జన నాట్య మండలిలో ప్రజల సాహిత్యాన్ని పాటల రూపంలో, కథల రూపంలో, నాటకల రూపంలో ప్రజలను చైతన్య పరుస్తూ భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో కదలించడలో తను కీలక పాత్ర పోషించాడు. అనేక పాటలు రచించారు. AILRC కార్యదర్శిగా కూడా కొద్ది కాలం పని చేశాడు. తెలంగాణ ప్రజా స్వామిక ఉద్యమాల్లో తొలి నాళ్ల నుండి మలి దశ వరకు పాల్గొన్నాడు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా పాటలు రాశాడు. దోపిడి పాలకులు ఎన్ కౌంటర్ లలో, బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా. చేసిన సందర్భంలో శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 80 దశకంలో నాలుగు సంవత్సరాలు దళం జీవితం కొనసాగించాడు. సాంస్కృతి రంగం యొక్క అవసరాన్ని పార్టీ గుర్తించి తనను బయటకు పంపి జన నాట్య మండలిని అభివృద్ధి చేసింది.
దోపిడి పాలక వర్గ తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో వుండగా చంద్ర బాబు హయాంలో విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రతిఘాతుక శక్తులతో నల్ల దండు ముఠాలను పోలీసుల ద్వారా ఏర్పర్చింది. వీరి ద్వారా ప్రజా సంఘాల్లో క్రియా శీలంగా పని చేస్తున్న అనేక మంది విప్లవ కారులపై నల్ల దండు ముఠాలతో కౄరమైన హత్యలు చేయించారు. అందులో భాగంగానే 1997లో గదర్ పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి గద్దర్ పై కాల్పులు చేశారు. ఐదు తూటాలు శరీరంలో దూసుకెళ్ళి ప్రాణ ప్రాయ స్థితి నుండి బయట పడినాడు.
తెలంగాణలో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న వర్గ పోరాటంలో ఎంతో మంది విప్లవ ప్రజానీకాన్ని, యువతి, యువకులను జన నాట్య మండలి పాటలతో ఉర్రూతలూగించిన గద్ద‌ర్ చివరి కాలంలో పార్టీ నింబంధనవళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలువడంతో మా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనితో 2012లో పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశాడు. దాన్ని మా పార్టీ ఆమోదించింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గద్ద‌ర్ ఆతరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నాడు.” అని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.