HomeTelanganaPolitics

పేదల కోసం గర్జించిన పాట వెళ్ళిపోతోంది… ప్రారంభమైన గద్దర్ అంతిమ యాత్ర

పేదల కోసం గర్జించిన పాట వెళ్ళిపోతోంది… ప్రారంభమైన గద్దర్ అంతిమ యాత్ర

పీడితుల కోసం అనేక ఏళ్ళు పోరు గొంతై గర్జించిన గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి వేలాదిగా అభిమానాల నినాదాల మధ్య ప్రారంభమైన గద్దర్ అం

మనిషిని చంపేసిన రోబో
బాలుడి ప్రాణాలు తీసిన తల్లితండ్రుల మూఢనమ్మకం… గంగలో ముంచి చంపేశారు
అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు – ముఖ్యమంత్రి ఆదేశాలు

పీడితుల కోసం అనేక ఏళ్ళు పోరు గొంతై గర్జించిన గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి వేలాదిగా అభిమానాల నినాదాల మధ్య ప్రారంభమైన గద్దర్ అంతిమ యాత్ర గన్ పార్క్ కు చేరుకుంది. అక్కడి నుంచి బయలు దేరి అల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్తుంది. అనంతరం ఆయన స్థాపించిన మహాబోధి మహావిద్యాలయంలో ఆయన దహన సంస్కారాలు జరుగుతాయి.

గద్దర్ అంతిమ‌యాత్రలో వందలాది కళాకార్లు పాటలు పాడుతూ ముందు నడుస్తున్నారు. జోహార్ గద్దర్ అంటూ అభిమానులు, సన్నిహితులు, అనుచరులు నినదిస్తున్నారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ మీదుగా ఆల్వాల్ లోని ఆయన నివాసం వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. తన నివాసంలో గద్దర్ పార్థివ దేహాన్ని కాసేపు ఉంచుతారు. ఇక్కడే గద్దర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పిస్తారు. అనంతరం తాను ఏర్పాటు చేసిన బోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి.