“భోపాల్‌కు చెందిన అంకితా, దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీపై ఆహారం పంపడం ఆపండి. ఇది 3వ సారి - అతను డబ్బులు చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు!'' అని
“భోపాల్‌కు చెందిన అంకితా, దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీపై ఆహారం పంపడం ఆపండి. ఇది 3వ సారి – అతను డబ్బులు చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు!” అని జొమాటో Zomato ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజనులు ఈ ట్వీట్ పై సరదాగా స్పందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే… భోపాల్ భొపల్ కు చెందిన అంకిత అనే యువతి మరో యువకుడి కోసం రోజు ఆహారం ఆర్డర్ చేసేది. అయితే ఆమె డబ్బులు కట్టకుండా క్యాష్ ఆన్ డెలివరీ COD రూపంలో ఆమె ఆర్డర్ చేసేది. జొమాటో డెలివరీ బాయ్ ఆ ఆహారాన్ని డెలవరీ చేయడానికి వెళ్ళిన ప్రతీ సారీ ఆ యువకుడు డబ్బులు కట్టకుండా ఆ ఆర్డర్ ను వెనక్కి పంపించేవారు.
ఈ తతంగాన్ని గమనించిన జొమాటో అంకితను ఉద్దేశించి తన మాజీ బాయ్‌ఫ్రెండ్ కోసం ఫుడ్ ఆర్డర్ చేయడం ఆపేయమని అభ్యర్థిస్తూ ట్వీట్ చేసింది.
ఆ తర్వాత జొమాటో మరో ట్విట్ చేసింది. ”ఎవరైనా దయచేసి అంకితకి చెప్పండి ఆమె ఖాతాలో COD బ్లాక్ చేయబడిందని – ఆమె మళ్లీ 15 నిమిషాల నుండి ప్రయత్నిస్తోంది.”
ఈ పోస్ట్ ట్ట్విట్టర్ Twitter ప్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారింది, 2.9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నవ్వించే ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షించింది. జొమాటో ‘డెలివర్ ఎ స్లాప్’ అనే సేవను ప్రారంభించాలని కొందరు నెటిజనులు సూచించారు.
ఒక వినియోగదారు ఇలా అన్నారు, “అంకిత మాజీ లవర్ ఆకలి, హృదయ విదారకమైన అనంతమైన లూప్‌లో చిక్కుకున్నట్లున్నాడు. ఇది ఎప్పటికీ ముగియని COD చక్రం!”
మరొకరు ఇలా వ్రాశారు, “ఇది పర్వాలేదు, జొమాటో. ”డెలివర్ ఎ స్లాప్’ అనే కొత్త సేవను ప్రారంభించడం గురించి ఆలోచించాలి. అది ప్రయోజనకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”
మరో నెటిజన్ “బాబు ఖానా నహీ ఖా రహా, లాల్” అని చమత్కరించారు. “అంకిత మాజీ అన్నట్టుగా : నేను విడిపోవడానికి ముందు చెల్లించాను, విడిపోయిన తర్వాత ఎందుకు చెల్లించాలి” అని మరొకరు వ్యాఖ్యానించారు.
“అతని పరిస్థితి హృదయవిదారకంగా ఉన్నట్టుంది. అతనికి ఆహారం ఉచితంగా ఇవ్వండి…..” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
అయితే ఇదంతా జొమాటో తన మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా సరదాగా చేసిందని మరికొందరు నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
Ankita from Bhopal please stop sending food to your ex on cash on delivery. This is the 3rd time – he is refusing to pay!
— zomato (@zomato) August 2, 2023