HomeTelanganaPolitics

‘జగ్గారెడ్డిని బీఆరెస్ లోకి తీసుకొస్తా’

‘జగ్గారెడ్డిని బీఆరెస్ లోకి తీసుకొస్తా’

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘట్నలు చోటు చేసుకున్నాయి.అసెంబ్లీ లో మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటె

115 మంది తో బీఆరెస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన కేసీఆర్…రెండు స్థానాల నుంచి కేసీఆర్ పోటీ
తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన – ఆగిన‌ బస్సులు
తెలంగాణ గవర్నర్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల నిరసన‌ – ఆగిన‌ బస్సులు

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘట్నలు చోటు చేసుకున్నాయి.
అసెంబ్లీ లో మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దగ్గరికి వెళ్ళి ఆయనను కౌగలించుకున్న సీన్ అందరినీ ఆకర్షించింది. ఇద్దరూ ఆప్యాయంగా కౌగలించుకొని పది నిమిషాల మ్పాటు ముచ్చట్లు చెప్పుకున్నారు.

అనంతరం అసెంబ్లీ బైట జరిగిన మరో సంఘటన విస్త్రుత రాజకీయ చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీ షర్ట్ వేసుకొని ఈ రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ బయట ఆయనను చూసిన కేటీఆర్ నవ్వుతూ పిల్ల‌ల‌తో క‌లిసి తిరిగితే ఎట్ల‌న్న‌..? అని పలకరించారు. దాంతో జగ్గారెడ్డి టీష‌ర్ట్ వేసుకుంటే పిల్ల‌ల‌వుతారా? అని అడిగారు. జగ్గారెడ్డితో పాటు ఉన్న టీఎన్‌జీవో రాష్ట్ర అధ్య‌క్షుడు మామిల్ల రాజేంద‌ర్ వైపు తిరిగిన కేటీఆర్ మీ ఇద్ద‌రికి ఎక్క‌డ దోస్తానా కుదిరింది అని అడిగారు. దానికి రాజేందర్ మాది ఎప్పటి నుంచో ఒకే కంచం, ఒకే మంచం అని జవాబిచ్చారు. దాంతో కేటీఆర్ తన మాటలను పొడిగిస్తూ అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డిని గెలిపిస్తవా ? అని నవ్వుతూనే ప్రశ్నించారు. దానికి రాజే‍ందర్ , అవును సంగా రెడ్డిలో జగ్గా రెడ్డిని గెలిపిస్తా మన పార్టీలోకి తీసుకొస్తా అని అన్నారు.