HomePoliticsNational

హర్యానా మత హింస: శోభా యాత్రలో పాల్గొన్న వారికి ఆయుధాలు ఇచ్చిందెవరు ?… కేంద్రమంత్రి ప్రశ్న‌

హర్యానా మత హింస: శోభా యాత్రలో పాల్గొన్న వారికి ఆయుధాలు ఇచ్చిందెవరు ?… కేంద్రమంత్రి ప్రశ్న‌

హర్యాణాలో మత హింస చెలరేగిపోతోంది. శొభాయాత్ర సందర్భంగా ప్రారంభమైన ఘర్షణలు అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. దుండగులు అనేక షాపులను దహనం చేశారు. పోలీసులపై దా

చోరీకి వెళ్ళి బ్యాంకును ప్రశంసలతో ముంచెత్తి వెనక్కి వెళ్ళిపోయిన దొంగ‌
కాసేపట్లో మీడియా ఎదుటకు దీప్తి సోదరి చందన
‘తోటి విద్యార్థులను కులము, మార్కులు అడగొద్దు’

హర్యాణాలో మత హింస చెలరేగిపోతోంది. శొభాయాత్ర సందర్భంగా ప్రారంభమైన ఘర్షణలు అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. దుండగులు అనేక షాపులను దహనం చేశారు. పోలీసులపై దాడులకు దిగారు. అసలు మత హింసకు కారణమైన శోభాయాత్రలో కార్యకర్తలు ఆయుధాలు చేతబూని ర్యాలీ తీశారు. వారికి ఆ ఆయుధాలు ఎవరు ఇచ్చారు ? ఇదే ప్రశ్న కేంద్ర మంత్రి కూడా అడుగుతున్నారు.

మతపరమైన ఆ ‘శోభా యాత్ర’ ఊరేగింపులో వ్యక్తులు ఆయుధాలు ఎందుకు కలిగి ఉన్నారని గుర్గావ్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇందర్‌జిత్ సింగ్ ప్రశ్నించారు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో సింగ్ మాట్లాడుతూ, “కిస్నే హథియార్ దియే ఉంకో ప్రొసెషన్ మే లే జానే కే లియే? కోయి తల్వార్ లేకే జాతా హై ప్రొసెషన్ మేం? లాఠీ-దండే లేకే జాతా హై (ఆ ఊరేగింపు కోసం ఎవరు ఆయుధాలు ఇచ్చారు? కత్తులు లేదా కర్రలు పట్టుకుని ఊరేగింపుకు ఎవరైనా వెళతారా)?”

“ఇది తప్పు. ఇటువైపు నుంచి కూడా రెచ్చిపోయారు. అవతలి వైపు వాళ్ళు రెచ్చగొట్ట లేదని నేను అనడం లేదు’ అని ఆయన అన్నారు.

పోలీసు బలగాలు తగినంతగా లేనందున కేంద్ర బలగాలను హర్యాణాలోని నుహ్‌కు పంపాలని తాను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరినట్లు కూడా సింగ్ చెప్పారు.

సమస్యను మరింత రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషించిందని సింగ్ ఆరోపించారు. “అలాంటి వీడియోలను ఎవరు అప్‌లోడ్ చేశారో విచారించాలని నేను పోలీసులను కోరాను. ‘మేము ఈ మతపరమైన కార్యక్రమానికి వస్తున్నామని, మీ దామద్ (అల్లుడు) కూడా వస్తున్నాడని,మీరు ఆపగలిగితే, ఆపండి. అంటూ రెచ్చ గొట్టే వీడియోలు ఉన్నాయి. ఇలాంటి బాధ్యతారహితమైన వీడియోలను అప్‌లోడ్ చేస్తే, అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అన్నారాయన‌.