HomeTelangana

బీఆర్ఎస్‌ను భయపెడుతున్న అనర్హత పిటిషన్లు.. ఈ నెలాఖరుకు తేలనున్న భవితవ్యం!

బీఆర్ఎస్‌ను భయపెడుతున్న అనర్హత పిటిషన్లు.. ఈ నెలాఖరుకు తేలనున్న భవితవ్యం!

సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే అనర్హత పిటిషన్లపై పార్టీ సీనియర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. తీర్పు వచ్చిన తర్వాత వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

‘కవితకు ఈడీ నోటీసులు పెద్ద డ్రామా’
మోడీతో ప్రైవేటు మీటింగ్ లో మాట్లాడిన సంచలన విషయాలు బైటపెట్టిన కేసీఆర్
బీజేపీ, బీఆరెస్ మధ్య పోరాట‍ం నిజమా? లేక ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం నిజమా ?

అధికార బీఆర్ఎస్ పార్టీని హైకోర్టులో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు భయపెడుతున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండగా.. ఈ అనర్హత పిటిషన్లు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ హైకోర్టు ఇటీవలే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావును అనర్హుడిగా ప్రకటించింది. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే అయినా.. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారు. ఇది పార్టీకి ఇబ్బందిగా మారింది.

దాదాపు 26 మంది ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్లకు సంబంధించిన తుది తీర్పు ఈ నెలాఖరు లోగా వచ్చే అవకాశం ఉన్నది. ఈ పిటిషన్లను తేల్చేయాలని హైకోర్టు నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఎంత మంది అనర్హత వేటుకు గురవుతారో అని బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందుతుంది. ఎన్నికల ముందు ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనర్హతకు గురైతే.. అది రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకే దాదాపు టికెట్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరైనా ఎమ్మెల్మేపై వేటు పడితే.. వారికి డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడానికి ఆటంకాలు ఏర్పడుతాయి. అదే సమయంలో వారి స్థానంలో ఇప్పటికిప్పడు కొత్త అభ్యర్థులను కూడా తీసుకొని రావడం బీఆర్ఎస్‌కు పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే అనర్హత పిటిషన్లపై పార్టీ సీనియర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. తీర్పు వచ్చిన తర్వాత వాటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. కోర్టులో పిటిషన్లు ఉన్న వారి పేర్లు తప్ప.. మిగిలిన నియోజకవర్గాలకు నెలాఖరు లోపు అభ్యర్థులను ప్రకటించడానికి కూడా కేసీఆర్ సిద్ధపడుతున్నట్లు సమాచారం.

హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు వీరివే..

  1. గద్వాల్ : కృష్ణమోహన్ రెడ్డి Vs డీకే అరుణ
  2. మహబూబ్‌నగర్ : శ్రీనివాస్ గౌడ్ Vs చంద్రశేఖర్
  3. పటాన్ చెరు : మహిపాల్ రెడ్డి Vs కాట శ్రీనివాస్ గౌడ్
  4. అసిఫాబాద్ : ఆత్రం సక్కు Vs కోవా లక్ష్మి
  5. ఖైరతాబాద్ : దానం నాగేందర్ Vs దాసోజు శ్రవణ్
  6. వేములవాడ : చెన్నమనేని రమేష్ బాబు Vs ఆది శ్రీనివాస్
  7. సికింద్రాబాద్ : పద్మారావు Vs కాసాని జ్ఞానేశ్వర్
  8. కొడంగల్ : పట్నం నరేందర్ రెడ్డి Vs రేవంత్ రెడ్డి
  9. ఇబ్రహీంపట్నం : మంచిరెడ్డి కిషన్ రెడ్డి Vs మల్‌రెడ్డి రంగారెడ్డి
  10. మంచిర్యాల : ప్రేమ్‌సాగర్ రావు Vs దివాకర్ రావు
  11. హుస్నాబాద్ : సతీష్ Vs చాడ వెంకటరెడ్డి
  12. తుంగతుర్తి : గ్యాదరి కిషోర్ Vs అద్దంకి దయాకర్
  13. దేవరకద్ర : ఆల వెంకటేశ్వర్ రెడ్డి Vs పవన్ కుమార్
  14. వరంగల్ ఈస్ట్ : నరేందర్ Vs రవీందర్
  15. ఆలేరు : గొంగడి సునీత Vs సతీష్
  16. జూబ్లీహిల్స్ : మాగంటి గోపీనాథ్ Vs విష్ణువర్ధన్ రెడ్డి
  17. మల్కాజ్‌గిరి : మైనంపల్లి హన్మంత్ Vs రామచందర్ రావు
  18. కరీంనగర్ : గంగుల కమాలకర్ Vs బండి సంజయ్
  19. ధర్మపురి : కొప్పుల ఈశ్వర్ Vs అడ్లూరి లక్ష్మణ్
  20. కోదాడ : బొల్లం మల్లయ్య Vs ఉత్తమ్ పద్మావతి
  21. నాగర్‌కర్నూల్ : మర్రి జనార్ధన్ Vs నాగం జనార్ధన్
  22. గోషామహల్ : రాజాసింగ్ Vs ప్రేమ్‌సింగ్ రాథోడ్
  23. వికారాబాద్ : మెతుకు ఆనంద్ Vs గడ్డం ప్రసాద్
  24. పరిగి : మహేశ్వర్ రెడ్డి Vs రామ్మోహన్ రెడ్డి
  25. జనగాం : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి Vs పొన్నాల లక్ష్మయ్య
  26. నాంపల్లి : జాఫర్ హుస్సేన్ Vs ఫిరోజ్ ఖాన్‌