HomeTelangana

సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టిన బీజేపీ.. చేరికల కోసం తీవ్ర కసరత్తు!

సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టిన బీజేపీ.. చేరికల కోసం తీవ్ర కసరత్తు!

బీఆర్ఎస్ నుంచి కొంత మంది మాజీ ప్రజాప్రతినిధులు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. అయితే వాళ్లు ఎవరనే విషయంపై బీజేపీ నాయకులు చాలా గోప్యతను పాటిస్తున్నారు.

బీజేపీకి బిగ్ షాక్:బీఆరెస్ లోకి దత్తత్రేయ‌ కూతురు?
కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం: కలకలం రేపుతున్న BJP నేతల వివాదాస్పద‌ వ్యాఖ్యలు
బీజేపీకి విజయశాంతి రాజీనామా!

తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల్లో నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో ఎలక్షన్స్‌కు సిద్ధం కాలేదు. కేంద్రంలో బీజేపీ బలంగా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం దాని పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. 119 నియోజకవర్గాలకు గాను.. గట్టిగా లెక్కపెడితే పాతిక మంది కూడా బలమైన అభ్యర్థులు ఆ పార్టీకి లేరు. దీంతో ఇతర పార్టీల నుంచి బలమైన క్యాండిడేట్లను పార్టీలోకి తీసుకొని రావాలని నిర్ణయించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. పాలమూరు నుంచి జూపల్లి కృష్ణారావు, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సినిమా నటుడు నితిన్.. ఇలా పలువురిని పార్టీలోకి తీసుకొని రావాలని భావించారు. చేరికల కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు ఈ బాధ్యత అప్పగించారు. కానీ, ఇతర పార్టీ నాయకుల చేరికపై ముందే లీకులు బయటకు వెళ్లడంతో మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. దీంతో ఇతర పార్టీలు అప్రమత్తపై తమ వారికి కాపాడుకోవడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేశాయి. బీఆర్ఎస్ నుంచి కీలక నేతల కూడా బయటకు వస్తారని బీజేపీ గతంలో ప్రకటించింది. కానీ, సీఎం కేసీఆర్ అప్రమత్తమై బీజేపీ దూకుడుకు కళ్లెం వేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులతో పాటు జూపల్లిని పార్టీలోకి తీసుకొచ్చింది. ఇవన్నీ బీజేపీ క్యాడర్‌లో నిరాశలో నింపాయి. దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇకపై చేరికలపై సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. ముఖ్యమైన నాయకుల చేరికలపై.. వారు పార్టీ కండువా కప్పుకునే వరకు బయట చర్చించవద్దని హెచ్చరించినట్లు తెలుస్తున్నది.

బీఆర్ఎస్ నుంచి కొంత మంది మాజీ ప్రజాప్రతినిధులు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. అయితే వాళ్లు ఎవరనే విషయంపై బీజేపీ నాయకులు చాలా గోప్యతను పాటిస్తున్నారు. తాము పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటున్న నేతలను అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని బీజేపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ముందుగానే బయటకు లీకులు వెళ్లడం ద్వారా.. చేరికలు విఫలం అవుతున్నాయని భావిస్తోంది. అందుకే ఇకపై పూర్తి గోప్యత పాటించాలని నిర్ణయించారు.

ఎవరైనా నాయకుడు బీజేపీలో చేరాలని అనుకుంటే.. ముందుగా వారిని ఢిల్లీకి పంపి అక్కడే పార్టీ కండువా కప్పాలని నిర్ణయించారు. పార్టీలో చేరికలకు సంబంధించి జాతీయ నాయకత్వం సైతం ఎప్పటికప్పుడు స్థానిక నేతలకు సూచనలు చేస్తోందని.. ఈ వ్యవహారాలను ఢిల్లీలోని నేతలు పర్యవేక్షిస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి చేరికల విషయంలో బీజేపీ సీక్రెట్ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.