HomeCinema

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ విజయం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ విజయం

ఆదివారం హైదరాబాద్ లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలోని

ఆ హీరోయిన్ ను రాత్రికి రూం కు రమ్మని హింసలు పెట్టిన తెలుగు హీరో ఎవరు ?
ఇకపై నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు – రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
సినీ నటి జయప్రద కు 6 నెలల జైలు శిక్ష‌

ఆదివారం హైదరాబాద్ లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలోని ప్యానెల్ వివిధ కమిటీల కోసం జరిగిన హోరాహోరీ పోటీలో సి.కళ్యాణ్ నేతృత్వంలోని ప్యానెల్‌ను ఓడించింది.

12 మంది సభ్యులతో కూడిన నిర్మాత ఎగ్జిక్యూటివ్ కమిటీకి దిల్ రాజు ప్యానెల్‌లోని ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు.
20 మంది సభ్యుల ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్‌లో ఆయన‌ ప్యానెల్ 12 సీట్లను గెలుచుకుంది.

డిస్ట్రిబ్యూటర్స్ కమిటీలో సి.కళ్యాణ్ , దిల్ రాజు ప్యానెళ్లిద్దరూ ఆరు స్థానాలను గెలుచుకున్నారు.

స్టూడియో ఎగ్జిక్యూటివ్ కమిటీలో, దిల్ రాజు ప్యానెల్ నాలుగు సీట్లలో మూడు కైవసం చేసుకుంది. 16 మంది సభ్యులతో కూడిన ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో దిల్ రాజు, కళ్యాణ్ చెరో ఎనిమిది స్థానాలను గెలుచుకున్నారు.

అంతకుముందు, ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో మొత్తం 1,600 మంది సభ్యులలో 1,454 మంది తమ ఓటు వేశారు.

ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)

దిల్ రాజు కి 7, సి కళ్యాణ్ కి 5..

డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)

దిల్ రాజు కి 6, సి కళ్యాణ్ కి 6.

స్టూడియో ఎక్సిక్యూటివ్ కమిటీ (4)

దిల్ రాజు కి 3, సి కళ్యాణ్ కి 1.

ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16)

దిల్ రాజు కి 8 , సి కళ్యాణ్ కి 8.