తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తీసేసి, కిషన్ రెడ్డిని ఆ పదవిని కట్టబెట్టిన తర్వాత సంజయ్ కి కేంద్ర మత్రి పదవి ఇస్తారని ఆయన, ఆయన అనుచర
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తీసేసి, కిషన్ రెడ్డిని ఆ పదవిని కట్టబెట్టిన తర్వాత సంజయ్ కి కేంద్ర మత్రి పదవి ఇస్తారని ఆయన, ఆయన అనుచరులు ఆశించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే బీజేపీ పార్టీ నిర్ణయం కారణంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేస్తారని ఆయన ప్లేస్ లో బండి సంజయ్ ని నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం సంజయ్ కి పార్టీ పదవితో సరిపెట్టింది.
బండి సంజయ్ ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ లను ప్రధాన కార్యదర్శులుగా, ఏపీకి చెందిన సత్యకుమార్ ను కార్యదర్శిగా, తెలంగాణకు చెందిన డీకే అరుణను ఉపాధ్యాక్షురాలిగా కొనసాగిస్తున్నట్టు నడ్డా ప్రకటించారు.