HomeTelangana

కార్యకర్త పాడే మోసిన డీసీసీ అధ్యక్షుడు

కార్యకర్త పాడే మోసిన డీసీసీ అధ్యక్షుడు

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన జీల రాజు గురువారం కరీంనగర్ పట్టణంలో గుండెపోటుతో మృతిచెందగా శుక్రవారం సొంత గ్రామం గన్నేరువరంలో

స్వయం పాలనలో పల్లెలు సస్యశ్యామలం: గంగుల కమలాకర్
మీడియా సెంటర్ ను ప్రారంభించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
సీఎం కేసీఆర్ నియోజకవర్గాన్ని మారుస్తున్నారా? గజ్వేల్‌కు గుడ్ బై చెప్తారా?

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన జీల రాజు గురువారం కరీంనగర్ పట్టణంలో గుండెపోటుతో మృతిచెందగా శుక్రవారం సొంత గ్రామం గన్నేరువరంలో అంతక్రియలు పూర్తి చేశారు, ముందుగా రాజు మృతదేహం పై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి, పూలమాలవేసి నివాళులు అర్పించిన డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, అనంతరం అంతిమయాత్రలో పాడే మూసి పాల్గొన్నారు. జీల రాజు యాదవ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ కుటుంబం జీల రాజు యాదవ్ లాంటి క్రియాశీలక కార్యకర్తను కోల్పోవడం బాధాకరం. రాజు కుటుంబ సభ్యులకు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్. కొనగాల మహేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేసి తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. వివిధ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పారువెళ్ల గ్రామ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గన్నేరువరం ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ గొల్లపల్లి రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, మానకొండూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, విద్య కమిటీ చైర్మన్ బుర్ర మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కూన కొమరయ్య, కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ సెక్రెటరీ గంప మహేష్, ఎన్,ఎస్,యూ,ఐ జిల్లా కార్యదర్శి దేశరాజు అనిల్, గొల్ల కురుమ యాదవ సంఘం మండల అధ్యక్షుడు సంధవేణి ప్రశాంత్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మానకొండూరు నియోజకవర్గం యువజన సంఘాల అధ్యక్షుడు గూడూరి సురేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్, గ్రామ ప్రజలు, యువకులు, స్నేహితులు, మహిళలు, కుటుంబ సభ్యులు, బంధువులు అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.