HomePoliticsNational

మణిపూర్ హింసాకాండకు నిరసనగా బీజేపీకి రాజీనామా చేసిన మరో నాయకుడు

మణిపూర్ హింసాకాండకు నిరసనగా బీజేపీకి రాజీనామా చేసిన మరో నాయకుడు

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ ప్రపంచ దేశాల్లో భారతదేశం పరువు తీశాయని ఆరోపిస్తూ బీహార్ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు వినోద్ శర్మ ఆ పార్టీకి రాజ

మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఓడిపోతుందని తెలిసీ ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా ?
ప్రియాంకా గాంధీపై దృష్టి కేంద్రీకరించిన బీజేపీ …ఆమెపై కేసు నమోదు… ఎందుకంటే …?
బీజేపీ రాష్ట్ర‌ కార్యాలయంలో బండి, ఈటల వర్గాల మధ్య ఘర్షణ‌

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ ప్రపంచ దేశాల్లో భారతదేశం పరువు తీశాయని ఆరోపిస్తూ బీహార్ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు వినోద్ శర్మ ఆ పార్టీకి రాజీనామాను చేశారు.

గురువారం మీడియాతో మాట్లాడిన శర్మ, “బాధాతప్త హృదయంతో” రాజీనామా చేసినట్లు చెప్పారు.

‘‘బాధాతప్త హృదయంతో బీజేపీకి రాజీనామా చేశాను. మణిపూర్‌లో పరిస్థితి యావత్ దేశాన్ని ఆందోళనకు గురిచేసింది. ప్రపంచం ముందు భారతదేశ ప్రతిష్టను దిగజార్చింది, ”అని ఆయన అన్నారు.

ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయని, మనం ఎన్నిటిపై చర్యలు తీసుకోగలమని మణిపూర్ ముఖ్యమంత్రి చెప్పడం దురదృష్టకరమన్నారు శర్మ‌.

“భారతదేశంలోని కుమార్తెలు, సోదరీమణులను నగ్నంగా వీధుల్లో ఊరేగించి వారిపై అత్యాచారం జరిగితే ముఖ్యమంత్రి నుండి ఇటువంటి ప్రకటన ఆశ్చర్యకరంగా ఉంది” అని ఆయన అన్నారు.

మెయిటీలు, కుకీల మధ్య కొనసాగుతున్న జాతి ఘర్షణలు ప్రారంభమైన ఒక రోజు తర్వాత మే 4న మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలోని బి ఫైనోమ్ గ్రామంలో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్నట్లు చూపించే వీడియోను శర్మ ప్రస్తావించారు.

హింస చెలరేగిన డెబ్బై తొమ్మిది రోజుల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ గురించి తన మౌనాన్ని వీడారు. వీడియో లు బహిరంగమైతే తప్ప ప్రభుత్వం చర్యలు చేపట్టదా అని శర్మ ప్రశ్నించారు.

ఈ వీడియో గురించి మోడీ మాట్లాడినప్పుడు, మణిపూర్ లో శాంతిభద్రతల పతనం లేదా మొత్తం హింసను ప్రస్తావించలేదెందుకని ఆయన అన్నారు.

‘అమర్ ఉజాలా’లోని ఒక రిపోర్ట్ ప్రకారం, శర్మ రాజీనామా లేఖను పాట్నాలోని రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యునైటెడ్) కార్యాలయాల ముందు పోస్టర్ రూపంలో అతికించారు.

పోస్టర్‌లో ఇలా ఉంది: “భారత్ కీ బెహెన్ బేటియా కరే చిట్‌కార్, శరం కరో బేటీ బచావో కా నారా దేనే వాలీ మోడీ సర్కార్” (భారతదేశంలోని కుమార్తెలు, సోదరీమణులు అరుస్తున్నారు, బేటీ బచావో అని నినాదాలు చేసే మోడీ సర్కార్ సిగ్గుపడాలి. )

ఈ పోస్టర్‌లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన రాజీనామా లేఖ కూడా ఉంది.

మణిపూర్‌లో జరుగుతున్న హింసకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ కారణమని శర్మ తన లేఖలో పేర్కొన్నారు ముఖ్యమంత్రిని ప్రధాని రక్షిస్తున్నారని ఆయన ఆరోపించారు.

అటువంటి నాయకత్వంతో పనిచేయడం తనకు కళంకం కలిగిస్తోందని, అందుకే రాజీనామా చేస్తున్నానని శర్మ చెప్పారు.

కాగా, ఈ నెల ప్రారంభంలో, మణిపూర్‌లో చర్చిల దగ్ధానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయని ఆరోపిస్తూ మిజోరం బిజెపి ఉపాధ్యక్షుడు ఆర్. వన్‌రామ్‌చువాంగా కూడా పార్టీకి రాజీనామా చేశారు.