HomeTelanganaPolitics

‘నీ పాటలు పాడుకోకుండా ఈ భజన కార్యక్రమాలు ఏంది భ‌య్యా !’

‘నీ పాటలు పాడుకోకుండా ఈ భజన కార్యక్రమాలు ఏంది భ‌య్యా !’

టాలీవుడ్ సింగర్ అనుజ్ గుర్వారా (Anuj Gurwara)పై నెటిజనులు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ అనుజ్ గుర్వారా అంటే ఎవరో మీకు తెలుసా ? ఈయన శేఖర్ కమ్ముల దర

యూనిఫాం సివిల్ కోడ్ కు మేం వ్యతిరేకం… స్పష్టం చేసిన కేసీఆర్
పూర్తి సబ్సిడీతో మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ నగరంలో వరద పరిస్థితిని పరిశీలించిన కేటీఆర్…ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచన‌

టాలీవుడ్ సింగర్ అనుజ్ గుర్వారా (Anuj Gurwara)పై నెటిజనులు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ అనుజ్ గుర్వారా అంటే ఎవరో మీకు తెలుసా ? ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ మూవీలో నటించిన యాక్టర్, జక్కన్న దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ (MagaDheera) చిత్రంలో ‘పంచదార బొమ్మా బొమ్మ’ పాటను పాడిన సింగర్. ఈ మధ్య ఈయన తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెటిజనుల విమర్శలకు కారణమయ్యింది.

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల హైదరాబాద్ నగర రోడ్లు నీళ్ళతో నిండిపోయి. ట్రాఫిక్ సమస్యలు ఏర్పాడ్డాయి. జూలై 24న కురిసిన కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధానంగా గచ్చిబౌలి IKEA రోడ్డులో ట్రాఫిక్ జామ్ దృశ్యాలు.. ఓ సినిమా సెట్టింగ్‌లా అనిపించాయి. ఆ ట్రాఫిక్ జామ్ వీడియోలను చూసిన వారంతా.. ఇది హైదరాబాద్ పరిస్థితి అంటూ.. దీనికి పరిష్కారమే లేదా అంటూ ప్రశ్నల వర్షం సంధించారు. అయితే .. సింగర్ అనుజ్ గుర్వారా మాత్రం ఆ ఒక్క వీడియోని పట్టుకుని.. ప్రభుత్వంపై విరుచుకుపడతారా? అన్నట్లుగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.

”జూలై 24న కురిసిన భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్ దృశ్యాలు ఒక పీడకలగా మారాయి. జామ్ అయిన IKEA రోడ్డు (గచ్చిబౌలి ప్రాంతం ) వీడియోలు వైరల్ అయ్యాయి.

ప్రభుత్వం నుండి జవాబుదారీతనం & పరిష్కారాలను కోరుతూ పొఅలువురు వ్యక్తులు సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేశారు.

అయితే అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్ జాం కు ప్రధాన కారణం గుర్తించారు. పదివేల మంది ఉద్యోగులు ఒకే సారి కార్యాలయాలనుండి కుండపోత వర్షంలో ఒకేసారి బయటకు వచ్చారు.

కాగా ప్రభుత్వం వెంటనే మేలుకొంది. అన్ని విభాగాల‌ను సమన్వయం చేసింది. అన్నికార్యాలయాల ఉద్యోగులు ఒకే సారి బైటికి రాకుండా వేరు వేరు సమయాలు కేటాయించింది. పలు కార్యాలయాలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం WFH నిర్ణయించాయి. సోషల్ మీడియా అప్ డేట్స్ పంపించారు. అందరి మధ్య‌ సమన్వయం తక్షణ ఫలితాలను చూపించింది.

రెండు రోజుల తర్వాత, పీక్ ఆఫీస్ గంటలలో, వర్షం ఉన్నప్పటికీ IKEA రహదారిపై ట్రాఫిక్ బాగా తగ్గింది. ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి వారు చేయగలిగినదంతా చేస్తున్న పోలీసు బలగాలకు, స్వచ్ఛంద సేవకులకు హ్యాట్సాఫ్.

ఇవి నా స్వతంత్ర పరిశీలనలు:

  • ఎవ్వరూ బ్లేమ్ గేమ్ చేపట్ట‌లేదు. తక్షణ చర్యలు చేపట్టారు.
  • ప్రభుత్వం, కార్పొరేషన్లు & వాలంటీర్ నెట్‌వర్క్‌ల మధ్య సమన్వయం.
  • సకాలంలో సోషల్ మీడియా అప్‌డేట్‌లు.
  • మరీ ముఖ్యంగా, మీడియా (టీవీ, వార్తాపత్రిక & సోషల్ మీడియా) అధికారులను జవాబుదారీగా ఉంచింది. ప్రజల పక్షాన జర్నలిస్టులు దీక్ష చేపట్టారు.

వాస్తవానికి, ఇది ఒక చిన్న ఉదాహరణ. హైదరాబాద్ Hyderabad తెలంగాణ Telangana అభివృద్ధి చెందుతున్న కొద్దీ క్రమక్రమంగా అధిగమించే అనేక ఇతర సమస్యలు ఉన్నాయి.

పెరుగుతున్న, వైవిధ్యభరితమైన జనాభా వలె సవాళ్లు కూడా విస్తారంగా ఉన్నాయి.

నగరం కోసం, రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సమన్వయం చేసుకుని కలిసి పనిచేయడం ముఖ్యం.” అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్5 పై నెటిజనులు మండిపడుతున్నారు. చాలా మంది వ్యంగ్యంగా స్పంధిస్తున్నారు.

”సినిమాల్లో పాటలు పాతలు పాడుకోకుండా ఈ భజన కార్యక్రమం ఏంటి భయ్యా ” అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఈయనకు ప్రభుత్వంతో ఏవో పనులు ఉన్నట్టున్నాయి అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

”ప్రస్తుతం మెజారిటీ కార్యాలయాలు వర్క్ ఫ్రం హోం నిర్ణయించింది కాబట్టి రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉద్యోగులు మళ్ళీ కార్యాలయాలకు వచ్చినప్పుడు తిరిగి ఈ పీడకల పునరావృతమవుతుంది. హైదరాబాద్‌లో నీటి ఎద్దడి, పెద్ద ప్రజా రవాణా కనెక్టివిటీ & డ్రైనేజీ వ్యవస్థ లేదు.” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.