HomeCinema

తాను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడో చెప్పిన నిర్మాత దిల్ రాజు

తాను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడో చెప్పిన నిర్మాత దిల్ రాజు

ఈ నెల 30న జరగనున్న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వస్తుందీ నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఈ రోజు ఆయన తన ప్యానెల్ ను ప్రకటించారు. ఈ ఎన

ఇండియాలో మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ లో సమంత నెంబర్ వన్
తెలుగు వాళ్ళు ఈ నటిని బహిష్కరించాలి
గుంటూరు కారం మూవీపై షారూఖ్ ఖాన్ ట్వీట్

ఈ నెల 30న జరగనున్న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వస్తుందీ నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఈ రోజు ఆయన తన ప్యానెల్ ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో దిల్ రాజు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమను ఏకతాటిపైకి తీసుకు రావడం కోసమే తాను ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నానని దిల్ రాజు తెలిపారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను పోటీ చేయాలని పలువురు నిర్మాతలు కోరినా ముందు తాను పోటీకి విముఖత చూపానని, అయితే ఇన్సురెన్స్ కార్డుల విషయంలో నిర్మాతల ఇబ్బందుల దృష్ట్యా పోటీ చేయాలని కోరితే అందుకు సిద్ధపడ్డానని, అప్పుడు గెలిపించారని దిల్ రాజు చెప్పారు.

ఇప్పుడు ఛాంబర్ ఎన్నికల్లో కూడా పరిశ్రమ మేలు కోసం పోటీ చేస్తున్నానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరినొకరు నిందించుకోవడం సరికాదన్నారు. తమకు పదవి ముఖ్యం కాదని, టాలోవుడ్ పరిశ్రమ బాగుపడటమే తమ లక్ష్యమని దిల్ రాజు అన్నారు. తమ ప్యానెల్ లో పెద్ద సినిమాలు చేసే నిర్మాతలు 70 శాతం మంది, చిన్న సినిమాలు చేసే నిర్మాతలు 30 శాతం మంది ఉన్నట్లు ఆయన చెప్పారు. ఫిల్మ్ చాంబర్ కు చెందిన అన్ని రంగాలను అభివృద్ధి చేసి, ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకే గొడుకు కిందకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామని, అందువల్ల తమ ప్యానల్ ను గెలిపించాలని ఆయన కోరారు.

కాగా దిల్ రాజు ప్యానల్ కు పోటీగా సీ. కళ్యాణ్ ప్యానల్ రంగంలోకి దిగింది. దిల్ రాజు గెలిచినా చిన్న సినిమాకు, నిర్మాతలకు ఎలాంటి సేవ చేయరని, ఆయనకు కావాల్సింది వ్యాపారం మాత్రమే అని సీ. కళ్యాణ్ విరుచుకపడ్డారు.

”మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో గెలిచి పరిశ్రమకు, నిర్మాతలకు చేసిన మేలు ఏమిటీ? ఇప్పుడు గెలిచి ఏం చేస్తారు? చిన్న నిర్మాతలకు, చిన్న చిత్రాలకు మీరు మేలు చేయరు. ఏం చేసినా మీ వ్యాపారం కోసమే. ఇప్పటి వరకు ఎంత మంది నిర్మాతల సమస్యలు తీర్చారో చెప్పండి.” అని సీ కళ్యాణ్ , దిల్ రాజును ప్రశ్నించారు.