HomeTelanganaPolitics

మణిపూర్ సమస్య‌తో నాకేం సంబంధం? ..కస్సుబుస్సులాడిన కిషన్ రెడ్డి

మణిపూర్ సమస్య‌తో నాకేం సంబంధం? ..కస్సుబుస్సులాడిన కిషన్ రెడ్డి

మణిపూర్‌లో కొనసాగుతున్న హింస , దుర్మార్గాలపై దేశం మొత్తం ఆందోళన చెందుతున్నప్పటికీ, నార్త్ ఈస్టర్న్ రీజియన్ (డోనర్) అభివృద్ధి శాఖను కలిగి ఉన్న కేంద్ర

తెలంగాణ నుంచి నరేంద్రమోడీ, ప్రియాంకా గాంధీ పోటీ ?
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా గాంధీ
మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి పరిపూర్ణానంద …మల్కాజిగిరి లేదా హిందూ పురం నుంచి ఎంపీగా పోటీ ?

మణిపూర్‌లో కొనసాగుతున్న హింస , దుర్మార్గాలపై దేశం మొత్తం ఆందోళన చెందుతున్నప్పటికీ, నార్త్ ఈస్టర్న్ రీజియన్ (డోనర్) అభివృద్ధి శాఖను కలిగి ఉన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మాత్రం నాకేం సంబంధం అంటూ చేతులు కడుక్కొన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న దానితో తన మంత్రిత్వ శాఖకు సంబంధం లేదని, ఇది శాంతిభద్రతల సమస్య అని పేర్కొన్నారు.

శనివారం ఇక్కడ మణిపూర్‌పై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ, “నేను మణిపూర్‌పై ఎందుకు మాట్లాడతాను. నాకు దానితో సంబంధం లేదు. ఇది లా అండ్ ఆర్డర్‌కి సంబంధించిన విషయం. నా మంత్రిత్వ శాఖకు దానితో సంబంధం లేదు.” అన్నారు.

అయితే మణిపూర్ సమస్య నుండి తప్పించుకోవడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు చాలా మందికి మింగుడుపడలేదు. పలువురు నెటిజనులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమస్యకు కేంద్రం తప్పకుండా పరిష్కారం చూపుతుందని మణిపూర్ ప్రజలకు హామీ ఇవ్వాలన్న కనీస మర్యాద కూడా మంత్రికి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నాయిని అనురాగ్ రెడ్డి అనే ట్విటర్ వినియోగదారు ట్వీట్ చేస్తూ, “మంత్రులు తమ ప్రమేయం లేదని భావిస్తున్నారు. వందల సంఖ్యలో ఉన్న కేసుల్లో ఇదొకటి మాత్రమేనని మణిపూర్ సీఎం భావిస్తున్నారు. ప్రధానమంత్రేమో కేవలం విచారంగా ఉన్నాన‌ని చెప్పారు. బ్రావో!” అని కామెంట్ చేశారు

”మణిపూర్ ఈశాన్య భారతంలో భాగమని మంత్రికి కనీసం తెలుసా?

అతను ఇప్పటికీ ఈశాన్య భారత‌ అభివృద్ధి వ్యవహారాల మంత్రి అని ఆయనకు గుర్తు లేదా?” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.