HomeNational

ఆయనికిస్తున్నది అవార్డా లేక జరిమానా రిసిప్టా ? చెప్పుకోండి చూద్దాం!

ఆయనికిస్తున్నది అవార్డా లేక జరిమానా రిసిప్టా ? చెప్పుకోండి చూద్దాం!

రోడ్డుపై ఓ బస్సు ముందు పోలీసు అధికారి Police Officer మరో వ్యక్తికి బహుమానమో, అవార్డో Award ఇస్తున్నట్టు ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా Social media

బెంగళూరులో డబుల్ సూపర్ ఓవర్… టీమిండియా గెలుపు
30 పార్టీలు Vs 24 పార్టీలు… దేశంలో వేడి పుట్టిస్తున్న రాజకీయాలు
టెక్ కంపెనీ MD, CEOలను నరికి చ‍ంపిన మాజీ ఉద్యోగి

రోడ్డుపై ఓ బస్సు ముందు పోలీసు అధికారి Police Officer మరో వ్యక్తికి బహుమానమో, అవార్డో Award ఇస్తున్నట్టు ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా Social media లో వైరల్ గా మారింది. సెటైర్లు, జోకులతో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. అసలేం జరిగిందంటే….

బెంగళూరులో Bengaluru ని గరుడాచారపాళ్య మెట్రో స్టేషన్ Metro Station సమీపంలో రద్దీగా ఉండే రోడ్డుపై స్కూల్ బస్సు School Bus డ్రైవర్ తప్పుగా యూ టర్న్ తీసుకోవడంతో “FixBangalorePls” అనే పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ బస్సు రాంగ్ టర్న్ తీసుకున్న వీడియోను షేర్ చేసింది. ” బ్రిగేడ్ మెట్రోపాలిస్ నుండి వచ్చిన విద్యార్థులతో నిండిన ఈ పాఠశాల బస్సు గరుడాచారపాల్య మెట్రో స్టేషన్ వద్ద‌ తప్పుడు తప్పుడు యూ టర్న్ తీసుకుంది. ఇది విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదంగా ఉంది. బస్ నంబర్ KA53AA6189” అని ట్వీట్ చేశారు. పోలీసులకు కూడా ట్యాగ్ చేశారు. అయినా మర్నాడు కూడా ఆ డ్రైవర్ అదే పని చేయడంతో మళ్ళీ వీడియో తీసి ఆ ట్విట్టర్ Twitter యూజర్ మళ్ళీ ట్వీట్ చేశాడు.

పాఠశాల బస్సు ప్రమాదకరమైన యు-టర్న్ తీసుకుంటున్న‌ వీడియోను షేర్ చేసి. “ఇది ఈరోజు వీడియో, నిన్న జరిగిందే మళ్ళీ జరిగింది. నిన్నటి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు?” అని ట్వీట్ లో పేర్కొన్నాడు.

వెంటనే స్పందించిన పోలీసులు ఆ డ్రైవర్ కు జరిమానా విధించినట్టు చెప్పారు. దానికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశారు.
రివార్డు ఇస్తున్న లెవల్ లో రోడ్డు చలాన్ (జరిమానా)ను బస్సు డ్రైవర్‌కు అందజేస్తున్న అధికారి ఫోటోను ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసి. “బస్సు డ్రైవర్‌కు జరిమానా విధించబడింది” అని మహదేవపుర ట్రాఫిక్ విభాగం ట్వీట్ చేసింది.
బస్సు డ్రైవర్ జరిమానా రసీదును పట్టుకుని, అతని పక్కన పోలీసు అధికారి నిలబడి ఉన్న ఈ ఫోటో పై ట్విట్టర్ వినియోగదారులు విభిన్న తరహాలో కామెంట్లు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ చేసిన పనికి అవార్డు ఇచ్చారా అని చాలా మంది సరదాగా అడిగారు.

నిజంగానే ఆ బస్సు డ్రైవర్ కూడా అవార్డు అందుకుంటున్నంత బిందాస్ గా ఆ రిసిప్ట్ అందుకోవడంతో జనాలకు నవ్వాగడంలేదు.
“అద్భుతమైన పని, డ్రైవర్ చేసిన పనికి, ‘నేను ఇంతకన్నా పెద్ద అవార్డును ఆశిస్తున్నాను’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా “హ హా! కొత్త మోడల్ వెహికిల్ సేల్ టైంలో తాళం చెవిని అందజేసినట్లుంది” మరొకరు అన్నారు.

“డ్రైవర్ రివార్డ్‌ని అంగీకరించినట్లు కనిపిస్తున్నాడు” అని మరొకరు వ్యాఖ్యానించగా, “విజేతకు అమితాబ్ బచ్చన్ రివార్డింగ్ చెక్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నాడు” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

ఈ ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేసినప్పటి నుండి, ఈ పోస్ట్ కు 2,28,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.