సాధారణంగా తెలుగు అమ్మాయిలకు రూ.10 లక్షలకు మించి పెద్దగా ముట్ట జెప్పరు. అయితే వైష్ణవి చైతన్య.. యూట్యూబ్ స్టార్‌గా, ఇన్‌ఫ్లూయన్సెర్‌గా గుర్తింపు తెచ్చుకున్నది.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన ‘బేబీ’ సినిమా జూలై 14న విడుదలై గ్రాండ్ సక్సెస్ సాధించింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు. బేబీ సక్సెస్ చూసి సినిమా వర్గాలు కూడా ఆశ్చర్యపడుతున్నాయి.
‘హృదయ కాలేయం’ అనే సినిమాతో మెగాఫోన్ పట్టిన దర్శకుడు సాయి రాజేశ్.. బేబీ సినిమాను మరింత అద్భుతంగా తీర్చిదిద్దాడు. తొలి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించబడింది. యువత ఈ సినిమాకు చక్కగా కనెక్ట్ కావడంతో మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
కాగా, ఈ సినిమాలో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌లకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆనంద్‌కు రూ.80 లక్షలు, వైష్ణవికి రూ.30 లక్షలు, విరాజ్‌కు రూ.20 లక్షలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక డైరెక్టర్ సాయి రాజేశ్‌కు మాత్రం రూ.1 కోటి ఇచ్చారని తెలుస్తున్నది. రెమ్యునరేషన్లపై భారీ ఖర్చు ఏమీ చేయలేదని.. నిర్మాతకు పెట్టుబడికి మించిన లాభాలు వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
సాధారణంగా తెలుగు అమ్మాయిలకు రూ.10 లక్షలకు మించి పెద్దగా ముట్ట జెప్పరు. అయితే వైష్ణవి చైతన్య.. యూట్యూబ్ స్టార్‌గా, ఇన్‌ఫ్లూయన్సెర్‌గా గుర్తింపు తెచ్చుకున్నది. యువతలో ఇప్పటికే వైష్ణవికి భారీ ఫాలోయింగ్ ఉన్నది. అందుకే ఆమెకు రూ.30 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆనంద్ దేవరకొండకు ఇప్పటి వరకు పెద్ద హిట్ లేకపోయినా.. అన్న విజయ్ ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగానే భారీగా పారితోషికం ఇచ్చినట్లు చర్చ జరగుతోంది.