HomeCinema

ఇండియాలో మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ లో సమంత నెంబర్ వన్

ఇండియాలో మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ లో సమంత నెంబర్ వన్

సమంత ఈ పేరు వినగానే అందమైన మొహం, అద్భుతమైన‌ నటనతో పాటు, కష్టాలకు ఎదురీది పోరాడే గుండె ధైర్యం గుర్తుకు వస్తుంది. తన వైవిధ్యమైన నటన‌, ప్రతిభతో ఆమె ప్రే

త్వరలో బీజేపీలోకి నటి జయసుధ?
టాలీవుడ్ నటులు రాజశేఖర్, జీవితలకు జైలు శిక్ష
డ్రగ్స్ కేసు: ఐదుగురు అరెస్ట్, టాలీవుడ్ లో ప్రకంపనలు, ‘బేబీ’ మూవీ టీం కు పోలీసుల నోటీసులు

సమంత ఈ పేరు వినగానే అందమైన మొహం, అద్భుతమైన‌ నటనతో పాటు, కష్టాలకు ఎదురీది పోరాడే గుండె ధైర్యం గుర్తుకు వస్తుంది. తన వైవిధ్యమైన నటన‌, ప్రతిభతో ఆమె ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడి పనిచేసే తత్వం ఆమెను నెంబర్ 1 గా నిలబెట్టింది. అనారోగ్యం సైతం ఆమె దృఢ సంకల్పం ముందు వెలవెలపోయింది. ఒకవైపు ఆమె తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స పొందుతూనే మరోవైపు తాను సైన్ చేసిన మూవీల్లో నటిస్తోంది.

జాతీయస్థాయిలో మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్-2023 జాబితాలో సమంత నెంబర్ వన్ గా నిలిచింది. ఓర్మాక్స్ మీడియా సంస్థ ఈ జాబితా రూపొందించింది.

సమంతా రూత్ ప్రభు చాలా మంది ప్రముఖ హీరోయిన్లను ఓడించి నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈమె ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇది ఎనిమిదోసారి.

ఓర్మాక్స్ మీడియా సంస్థ రూపొందించిన టాప్ టెన్ జాబితా:

  1. సమంత రూత్ ప్రభు
  2. అలియా భట్
  3. దీపిక పదుకొణే
  4. నయనతార
  5. కాజల్ అగర్వాల్
  6. త్రిష
  7. కత్రీనా కైఫ్
  8. కియారా అద్వానీ
  9. కీర్తి సురేశ్
  10. రష్మిక మందన్న

ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి మూవీ త్వరలో విడుదల కానుంది.