HomePoliticsEditor's Choice

హింస, దాడులు, మహిళల నగ్న ఊరేగింపులు, అత్యాచారాలు… మండుతున్న మణిపూర్ మోడీకి ఎందుకు పట్టదు ?

హింస, దాడులు, మహిళల నగ్న ఊరేగింపులు, అత్యాచారాలు… మండుతున్న మణిపూర్ మోడీకి ఎందుకు పట్టదు ?

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయాలకు పర్యాయపదంగా మారిన హింసా రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi మరోసారి బయటపెట్టారు. మణి

కుకీ, కేంద్రం శాంతి ఒప్పందానికి డేట్ ఫిక్స్ కాగానే మణిపూర్ లో హింస రేగడానికి కారణమెవరు ?
మణిపూర్ హింస: ప్రధాని మోడీ పై మండిపడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు
మణిపూర్ మీడియా కుకీలకు వ్యతిరేకంగా మైతీల మీడియాగా మారిపోయింది

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయాలకు పర్యాయపదంగా మారిన హింసా రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi మరోసారి బయటపెట్టారు. మణిపూర్‌ Manipur లో జరిగిన మెజారిటీ హింసపై ఆయన మౌనం వీడారని అనుకున్నది నిజం కాదని తేల్చేశారు. వాస్తవానికి, తన ఎదురుదాడి శైలిలో, అతను తన మద్దతుదారులను ప్రతిపక్ష-పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రేరేపించాడు. రాజస్థాన్, చత్తిస్ గడ్ ప్రభుత్వాలు లైంగిక హింస కేసులకు వ్యతిరేకంగా చర్య తీసుకోలేదని ఆరోపించారు. మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న హింసను గుర్తించాల్సిన అవసరం లేదని పరోక్షంగా ఆయన తన అనుచరులకు తెలియజేశారు. ఆయన పిలుపును అర్దం చేసుకున్న వాట్సప్ సైన్యం ప్రతిపక్షంపై దాడికి దిగింది.

మోడీ ప్రకటన తరువాత, బిజెపి BJP నాయకులు, అతని సోషల్ మీడియా Social media సైన్యం కాంగ్రెస్ Congress నాయకులపై దాడి చేయడం ప్రారంభించింది. మణిపూర్ లో కుకీ KUKI స్త్రీలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన వీడియోలను చూసి ప్రపంచమంతా నివ్వెరపోయిన సమయంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటం లేదని మోడీ అనుచరులు ప్రశ్నల దాడులు చేశారు.

మణిపూర్లో కుదాదాపు మూడు నెలలుగా కూకీ ప్రజలు మెజార్టీ మైటీ meiteiల దాడులను ఎదుర్కొంటున్న అసలు సమస్యను పక్కదోవ పట్టించి, దాన్ని ముగ్గురు మహిళలపై హింసకు సంబంధించిన అంశంగా మార్చే ప్రయత్నం చేశారు.

సంఘటన జరిగిన దాదాపు మూడు నెలల తర్వాత, ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రను చేసి, వారిని ఊరేగించిన గుంపు లైంగికంగా వేధించినట్లు చూపించే వీడియో బయటపడింది. ఈ వీడియో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైం ది. అందుకు సంబంధించిన బహిరంగ ప్రతిచర్యలు కూడా స్పష్టంగా కనిపించాయి.

అయితే, ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాతే రాష్ట్ర ముఖ్యమంత్రికి, దేశ ప్రధానికి, దేశ హోమంత్రికి తెలిసిందంటే మనం నమ్మాలా? పైగా ఆ దుర్మార్గ సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు కూడా. సాధారణ ప్రజలలాగే వారు కూడా ఈ సంఘటన గురించి వీడియో ద్వారా మాత్రమే తెలుసుకున్నారని , కుకీ ప్రజలపై జరిగుతున్న దారుణమైన‌ హింస గురించి వారికి తెలియదని మనను నమ్మమంటున్నారు.

దీన్ని బట్టే మణిపూర్ దాడులు, హింస గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏమిటనేది మనకు అర్దమవుతోంది. మణిపూర్‌లోని మహిళలు తమపై జరిగిన దారుణాల గురించి పోలీసులకు, జాతీయ మహిళా కమిషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదుల గురించి వారికి బాగా తెలుసు. ముఖ్యమంత్రి కుకీలపై మెజారిటీ హింసను రెచ్చగొట్టారని, హింసాత్మక మెయిటీ గ్రూపులకు పూర్తి మద్దతుగా నిల్చారని కుకీలు ఆరోపిస్తున్నారు.

మోడీ తన ప్రసంగంలో, దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మణిపూర్ హింస గురించి క్లుప్తంగా మాట్లాడే ముందు, సావన్ (రుతుపవనాలు) , డిజిటల్ ఇండియాతో యువత అనుబంధం గురించి ఉల్లాసంగా మాట్లాడి. మణిపూర్ హింసపై ఆయన తన ఉదాసీనతను చాటుకున్నారు.

మణిపూర్‌లో కుకీలపై దాడి చేసినవారు మెయిటీ కమ్యూనిటీకి చెందినవారు. రాష్ట్ర ప్రభుత్వ నిశ్శబ్ద మద్దతుతో మెయిటీ గ్రూపులు ఈ దాడులకు పాల్పడ్డాయి. మహిళల‌పై లైంగిక హింసలకు పాల్పడ్డాయి.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, హింసకు పాల్పడింది కేవలం మైటీ గుంపు మాత్రమే కాదు. రాష్ట్ర పోలీసులు కూడా ఆ ముగ్గురు మహిళలను గుంపుకు అప్పగించడం ద్వారా హింసలో పాల్గొన్నారు. కొందరు చెప్పుకునే విధంగా ఆ ముగ్గురు మహిళలను గుంపు బలవంతంగా లాక్కోలేదు.

ఇంత దారుణమైన హింస జరుగుతూ ఉంటే ప్రధాని మాట్లాడకపోతారా అని కొందరు అమాయకంగా ఆశిస్తూ ఉంటారు. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో ముస్లింలపై హింస జరిగినప్పుడు మోడీ ఉన్న స్థానంలోనే ఇప్పుడు మణిపూర్ సీఎం బీరేన్‌సింగ్ ఉన్నారన్నది మనం మర్చిపోవద్దు.