తెలంగాణ Telangana బీజేపీ BJP కి కొత్త అధ్యక్షుడిగా నియమించబడ్డ G. కిషన్ రెడ్డి G.Kishan Reddy ఈ రోజు పార్టీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ
తెలంగాణ Telangana బీజేపీ BJP కి కొత్త అధ్యక్షుడిగా నియమించబడ్డ G. కిషన్ రెడ్డి G.Kishan Reddy ఈ రోజు పార్టీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ Bandi sanjay సహా పలువురు నేతలు ప్రసంగించారు.
ఈ సమావేశంలో ప్రసంగించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Komati reddy Rajgopal Reddy భావోద్వేగానికి గురయ్యారు. ”బండి సంజయ్ ని చూసి ఏడుపొచ్చింది. ఏడుపు ఆపుకోలేక బాత్ రూం లోకి వెళ్ళి ఏడ్చాను. తెలంగాణలో బీజేపీకీ జోష్ వచ్చిందంటే కారణం బండి సంజయ్ మాత్రమే ” అని అన్నారు.
తాను పార్టీ మారుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తన ప్రాణం ఉన్నంతవరకు బీజేపీలోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి మచ్చలేని మనిషని ఆయన నాయకత్వంలో అందరం పనిచేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని రాజగోపాల్ రెడ్డి అన్నారు.