HomeTelangana

సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కోకాపేట స్థలం విషయంలో హైకోర్టు నోటీసులు

సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కోకాపేట స్థలం విషయంలో హైకోర్టు నోటీసులు

ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, భూపరిపాలన చీఫ్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

కేంద్రానికి మ‌నం రూపాయి ఇస్తే 46 పైస‌లు మాత్ర‌మే తిరిగి వ‌స్తున్నాయి…మోడీపై KTR ద్వజం
స్వయం పాలనలో పల్లెలు సస్యశ్యామలం: గంగుల కమలాకర్
కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు…ఒక్క సీటులో కూడా బీజేపీకి డిపాజిట్ రాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ సీఎం కేసీఆర్, అధికార బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. కోకాపేట భూలావాదేవి వ్యవహారంలో కోర్టు రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్‌కు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని సర్వే నెంబర్ 239, 240లో ఉన్న 11 ఎకరాల అత్యంత విలువైన భూమిని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కు కేటాయించడంపై వివరణ ఇవ్వాలంటూ సదరు నోటీసులు జారీ చేసింది. కేబినెట్ నిర్ణయం లేకుండానే ఈ భూములు కేటాయించారా అనే అంశంపై తగిన వివరణ ఇవ్వాలని కోరుతూ.. విచారణను అగస్టు 16కు వాయిదా వేసింది.

బీఆర్ఎస్‌కు 11 ఎకరాల భూమిని కేటాయింపును సవాలు చేస్తూ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అక్కడ ఎకరం రూ.50 కోట్ల మార్కెట్ విలువ ఉండగా.. బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం కేవలం రూ.3.41 కోట్లకే కట్టబెట్టిందని పేర్కొన్నారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.500 కోట్ల నష్టం కలిగిందని పిల్‌లో పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది.

కాగా, ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ జే. రామచందర్ రావు వాదనలు వినిపించారు. కోకాపేటలో 11 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్‌కు కేటాయించడంపై కేబినెట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కేబినెట్ నిర్ణయం తర్వాత ప్రొసీడింగ్ కాపీని పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులోకి ఉంచుతామని చెప్పారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి వాదనలు వినిపించారు. ఎలాంటి టెండర్లు లేకుండానే బీఆర్ఎస్‌కు అత్యంత విలువైన స్థలాన్ని కేటాయించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పబ్లిక్ డొమైన్‌లో ఎలాంటి వివరాలు ఉంచలేదని పేర్కొన్నారు.

ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, భూపరిపాలన చీఫ్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.