HomeTelangana

రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు

రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు

రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను ఎండగడతామని అన్నారు. అలాగే గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ నేతలు బీసీలపై చేస్తున్న వ్యతిరేక విధానాలను వివరిస్తామని చెప్పుకొచ్చారు.

బీఆరెస్ కు గుడ్ బై-కాంగ్రెస్ లో చేరిన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్
BRS వైపే తెలంగాణ… ‘జనతా కా మూడ్’ సర్వే
కాంగ్రెస్ బలంగా ఉన్న చోటే బీజేపీ కార్యక్రమాలు.. ఇది దేనికి సంకేతం?

బీసీ ప్రజా ప్రతినిధులను కించపరిచేలా, వ్యక్తిగత ఆరోపణలు చేస్తుండటంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలలో ఎదుగుతున్న నాయకులను చులకన చేస్తూ.. బరితెగించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలపై వారు విరుచుకపడ్డారు. అహంకారంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ నాయకులు ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..

బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. బీసీల జోలికి వస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని మంత్రి హెచ్చరించారు. సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ముందుకు వెళ్తున్న బీసీలను చూసి ఆక్రోశంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బీసీలను అణచివేయాలనే లక్ష్యంతో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని తలసాని ఆరోపించారు.

బీసీలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మాట్లాడిస్తున్నారని మంత్రి అన్నారు. బీసీల్లో ఎలా పంచాయితీ పెట్టాలా అని కొంత మంది ప్లాన్ చేస్తున్నారని.. మా ఓట్లతో గెలిచి మమ్మల్నే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపట్ల ఎలా వ్యవహరించాలనే విషయంపై త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామని మంత్రి అన్నారు. కులాల వారీగా మీటింగ్స్ పెట్టి అందరినీ ఏకం చేస్తామని అన్నారు. బీసీలపై అవాకులు చెవాకులు పేలుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనే వదలబోమని హెచ్చరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను ఎండగడతామని అన్నారు. అలాగే గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ నేతలు బీసీలపై చేస్తున్న వ్యతిరేక విధానాలను వివరిస్తామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, యోగ్గె మల్లేశం, బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, గంప గోవర్థన్, ఎంపీలు బగుడుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రతో పాటు పలు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.