HomeNational

చంద్రుడి మీదికి చేరుకోవడానికి రష్యాకు ఒకట్టిన్నర రోజులు, అమెరికాకు నాలుగురోజులు పడితే మనకు 40 రోజులు… కారణమేంటి ?

చంద్రుడి మీదికి చేరుకోవడానికి రష్యాకు ఒకట్టిన్నర రోజులు, అమెరికాకు నాలుగురోజులు పడితే మనకు 40 రోజులు… కారణమేంటి ?

ఈ రోజు మనదేశపు చంద్ర మిషన్, చంద్రయాన్-3, చంద్రునిపైకి బయలుదేరింది. ఇది చంద్రుడిని చేరడానికి 40 రోజులకు పైగానే పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వే

న్యూ ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా లో పవన్ జన్మదిన వేడుకలు
అమెరికా: తానాలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు… ఎక్కడైనా తెలుగువాళ్ళు సత్తా చూపిస్తారన్న బాలకృష్ణ‌

ఈ రోజు మనదేశపు చంద్ర మిషన్, చంద్రయాన్-3, చంద్రునిపైకి బయలుదేరింది. ఇది చంద్రుడిని చేరడానికి 40 రోజులకు పైగానే పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అయితే అంతరిక్ష నౌక చంద్రుడిని చేరుకోవడానికి ఒక నెల కంటే ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది?

“చంద్రునికి ప్రయాణం చాలా కష్టం. దీనికి ఖచ్చితమైన లెక్కలు, జాగ్రత్తగా ప్రణాళిక, అంతరిక్ష భౌతికశాస్త్రంపై లోతైన అవగాహన అవసరం. భూమి చుట్టూ చంద్రుని కక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది, అంటే భూమి నుండి దాని దూరం మారుతూ ఉంటుంది. చంద్రుడి ఒకచివర‌ భూమి నుండి 3,63,104 కిమీ దూరంలో ఉండగా దాని మరో చివర 4,05,696 కిమీ దూరంలో ఉంది. భూమి, చంద్రుని మధ్య సగటు దూరం 3,84,400 కి.మీ. శాస్త్రవేత్తలు చంద్రునిపై పర్యటనలను ప్లాన్ చేసేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. చంద్రయాన్-2 మిషన్ చంద్రుడిని చేరుకోవడానికి దాదాపు ఆరు వారాల సమయం పట్టింది. సురక్షితమైన ల్యాండింగ్ జరగడానికి అత్యంత‌ జాగ్రత్త పద్దతిని అనుసరించింది. ఈ ప్రయాణంలో స్పేస్‌క్రాఫ్ట్ అవరోహణను నెమ్మదింపజేయడానికి బ్రేకింగ్ విన్యాసాలు చేయాల్సి వస్తుంది” అని ఏరోస్పేస్, అంతరిక్ష నిపుణుడు గిరీష్ లింగన్న ఓ ప్రముఖ మీడియా సం స్థతో చెప్పారు.

“చంద్రయాన్-3 జూలై 14న ప్రయోగిస్తే ఆగస్టు చివరి నాటికి చంద్రుడిని చేరుతుందని భావిస్తున్నారు. ఇది పూర్వీకుడైన చంద్రయాన్-2 విధానాన్నే అనుసరిస్తుంది. ప్రయాణానికి 45-48 రోజులు పట్టవచ్చు, ఆగస్టు 23 లేదా 24 నాటికి అంతరిక్ష నౌక చంద్రుడిని చేరుకోగలదు, ”అని లింగన్న చెప్పారు.

ఇక రష్యా, అమెరికాలు ప్రయోగించిన అంతరిక్ష నౌకలు అత్యంత వేగంగా ఎందుకు వెళ్ళగలిగాయి. మన చంద్రయాన్ అంత‌ వేగంగా వెళ్ళకపోవడానికి కారణాలేంటి ?

1952లో రష్యా USSR ప్రయోగించిన లూనా-2 క్రాఫ్ట్ చంద్రుడిని చేరుకోవడానికి కేవలం 34 గంటల సమయం పట్టింది. ఇక అమెరికా అపోలో 8 చంద్రున్ని చేరుకోవడానికి 69 గంటల 8 నిమిషాలు పట్టగా, అపోలో 8 చంద్రుడిని చేరుకోవడానికి కనీసం 74 గంటలు పట్టింది. అపోలో 17 మిషన్ చంద్రునిపై దిగిన చివరి మిషన్.ఇది చంద్రుడిని చేరుకోవడానికి 86 గంటల 14 నిమిషాలు పట్టింది.

అంతరిక్షంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి, అధిక వేగం, సరళమైన దారి అవసరం. అపోలో 11 మిషన్ గంటకు 39,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడానికి సాటర్న్ V అనే సూపర్ హెవీ-లిఫ్ట్ లాంచర్‌ను ఉపయోగించింది. సాటర్న్ V రాకెట్ లూనార్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, కమాండ్ మాడ్యూల్‌తో సహా 43 టన్నుల బరువును ఎత్తగలదు. లాంచర్ , లూనార్ క్రాఫ్ట్ కేవలం నాలుగు రోజుల్లో 3,80,000 కి.మీలు ప్రయాణించి చంద్రుడిని చేరుకోవడానికి శక్తివంతమైన ఇంజన్లను ఉపయోగించాయి. 1969 , 1971 మధ్య అపోలో మిషన్లు NASAకి ఒక్కొక్కదానికి $185 మిలియన్లు ఖర్చు చేసింది. 2016 లో అపోలో 17 కోసం $1.2 బిలియన్లు ఖర్చు చేసింది. ఇందులో ఒక్కో సాటర్న్ V రాకెట్ నిర్మాణానికి 110 మిలియన్ డాలర్లు వెచ్చించారు.

“భారత రాకెట్లు చంద్రుడిపైకి నేరుగా అంతరిక్ష నౌకలను పంపేంత శక్తివంతంగా లేవు. బదులుగా, వారు భూమికున్న‌ గురుత్వాకర్షణ ప్రయోజనాన్ని పొందే సర్క్యూట్ మార్గాన్ని ఉపయోగిస్తారు. వ్యోమనౌకను మొదట జియోసింక్రోనస్ బదిలీ కక్ష్యలో GSLV మార్క్3 లేదా LVM 3 ద్వారా ఉంచారు. ఇది 4 టన్నుల బరువును ఎత్తే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వ్యోమనౌక దాని భూమికి సంబందించిన కక్షలోని చివరి అంకానికి చేరుకున్న తర్వాత, అది చంద్రుని కక్ష్యలోకి స్లింగ్‌షాట్ చేస్తుంది, ”అని లింగన్న తెలిపారు.

NASA చంద్రుని మిషన్లతో పోలిస్తే ISRO మిషన్లు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. చంద్రయాన్ 3 కోసం కేటాయించిన బడ్జెట్ రూ.615 కోట్లు. ఇందులో ప్రయోగ వ్యయం రూ.75 కోట్లు. చంద్రయాన్ 2 మొత్తం మిషన్ వ్యయం 978 కోట్లు.

చంద్రుడి మీదికి వెళ్ళడానికి మనకు వేగం అవసరం లేదు. అందుకే ఇస్రో ప్రాజెక్టు వ్యయాన్ని ద్ఱ్ఱ్ష్టిలో పెట్టుకొని భిన్నమైన మార్గాన్ని అవలభించింది. వేగానికి ప్రాధాన్యతనిచ్చిన మునుపటి మిషన్‌ల మాదిరిగా కాకుండా, చంద్రయాన్-3 విభిన్న విధానాన్ని తీసుకుంటుంది, ఖర్చు తగ్గించడం, భద్రత పై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించింది ఇస్రో. రష్యా, అమెరికాలు దాదాపు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన‌ పనినే మన‍ శాస్త్రవేత్తలు 615 కోట్ల రూపాయలతో పూర్తి చేయగల్గుతున్నారు.