తెలంగాణలో ఉచిత విద్యుత్తు అంశంపై అధికార్ అబీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రచ్చ నడుస్తున్న నేపథ్యంలో తాను చెప్పిన విషయాలేంటి…బీఆరెస్ ఆ మాటలను ఎలా వక
తెలంగాణలో ఉచిత విద్యుత్తు అంశంపై అధికార్ అబీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రచ్చ నడుస్తున్న నేపథ్యంలో తాను చెప్పిన విషయాలేంటి…బీఆరెస్ ఆ మాటలను ఎలా వక్రీకరించిందీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు మీడియాకు వివరించారు.
రైతులకు 24 గంటలు ఉచిత విధ్యుత్తు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ ముసుగులో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. ”ప్రజలకు భారంగా ఉన్న కేసీఆర్ సర్కార్‌ను కచ్చితంగా రద్దు చేస్తాం ఉచిత విధ్యుత్తును కొనసాగిస్తాం. అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఉచిత విధ్యుత్తు అంశంపై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు విసిరిన సవాల్ ను స్వీకరించే దమ్ము ఉందా అని మంత్రులు కేటీఆర్, హరీష్‌లకు రేవంత్ సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఓ సంచలన సర్వేను బైటపెట్టారు. ఈ సర్వే ఎవరు చేయించారో మాత్రం ఆయన చెప్పలేదు. ఆ సర్వేలో గజ్వెల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓటమి చవిచూస్తారని తేలిందని, అందుకే ఆయన మరో నియోజకవర్గం చూకుంటున్నారని రేవంత్ తెలిపారు. 104 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలలో 80 శాతం మంది ఓడిపోతారని సర్వే తేల్చిందని చెప్పిన రేవంత్ దమ్ము7ంటే సిట్టింగులకే సీట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించగలరా అని ప్రశ్నించారు.
కాగా, ఇప్పుడు రేవంత్ బహిర్గత పర్చిన ఈ సర్వేపై సోషల్ మీడియాలో విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఫేక్ సర్వే అని బీఆరెస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉండగా, సర్వేలో నిజమున్నదని, కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని మరికొందరు నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.