HomeTelanganaPolitics

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం… స్పష్టం చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం… స్పష్టం చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్

రైతులకు ఉచిత విధ్యుత్తు విషయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు తెలంగాణలో ఆగడంలేదు. రైతులకు 8 గంటల ఉచిత విధ్యుత్తు సరిపోతుందని,

నోరు మూసుకోక పోతే ఇంటికి ఈడీని పంపుతా – విపక్షాలకు కేంద్ర మంత్రి హెచ్చరిక‌
BRS వాళ్ళకు తుపాకులు కావాలేమో మేము కంటి చూపుతో చంపేస్తాం… జగ్గారెడ్డి
‘రేవంత్ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు’

రైతులకు ఉచిత విధ్యుత్తు విషయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు తెలంగాణలో ఆగడంలేదు. రైతులకు 8 గంటల ఉచిత విధ్యుత్తు సరిపోతుందని, 24 గంటల ఉచిత విధ్యుత్తు కార్పోరేట్ విధ్యుత్తు సంస్థల లాభాల కోసం కేసీఆర్ చేస్తున్న కుట్ర అని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విధ్యుత్తు ఇవ్వబోమని రేవంత్ చెప్పినట్టు బీఆరెస్ ఆరోపణలు చేసింది. రేవంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది.

రేవంత్ వ్యాఖ్యలపై ఆయన స్వంత పార్టీలో కూడా విమర్శలు వచ్చాయి. రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ కూడా ఖండించారు.

అయితే రేవంత్ మాటలను వక్రీకరించారని, ఆయన 24 గంటల ఉచిత విధ్యుత్తు తాము ఇవ్వబోమని ఎక్కడా చెప్పలేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పోరేట్ సంస్థల కోసం పని చేస్తున్నాడని చెప్పడానికే రేవంత్ ఆ మాటలు మాట్లాడారని, ఆయన మాటల్లో ఎక్కడా తాము ప్రభుత్వంలోకి వచ్చాక ఉచిత విధ్యుత్తు ఇవ్వబోమంటూ చెప్పలేదని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాకుర్ అన్నారు. ఇవ్వాళ్ళ మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విధ్యుత్తును కొనసాగిస్తామని, మరింత నాణ్యమైన విధ్యుత్తు ఇస్తామని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో బీఆరెస్ ఓడిపోబోతున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి రానున్నదనే విషయం అర్దమైన బీఆరెస్ నేతలు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఇప్పటి వరకు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏపార్టీ కూడా చేపట్టలేదని గుర్తు చేశారు ఠాకూర్. వరంగల్ లో జరిగిన సభలో రాహుల్ గాంధీ మొట్టమొదట రైతుల సంక్షేమం కోసమేరైతు డిక్లరేషన్ ప్రకటించారన్న విషయాన్ని ఠాకూర్ గుర్తు చేశారు.