HomeTelanganaPolitics

బీజేపీ, బీఆరెస్ మధ్య పోరాట‍ం నిజమా? లేక ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం నిజమా ?

బీజేపీ, బీఆరెస్ మధ్య పోరాట‍ం నిజమా? లేక ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం నిజమా ?

తెలంగాణలో అధికార పార్టీ బారత రాష్ట్ర సమితి, బీజేపీతో మధ్య‌ రహస్య ఒప్పందం ఉందని, రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయని బైటికి మాత్రం పోరాడుతున్నట్టు

అమిత్ షా ఒత్తిడితో చివరకు కాసినో కింగ్ చీకోటిని బీజేపీలో చేర్చుకున్నారు
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల – కేసీఆర్ పై ఈటెల పోటీ
సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టిన బీజేపీ.. చేరికల కోసం తీవ్ర కసరత్తు!

తెలంగాణలో అధికార పార్టీ బారత రాష్ట్ర సమితి, బీజేపీతో మధ్య‌ రహస్య ఒప్పందం ఉందని, రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయని బైటికి మాత్రం పోరాడుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో జరిగిన రెండు సంఘటనలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

ఈ నెల 2వ తేదీన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర ముగింపు, మాజీ ఎంపీ , బీఆరెస్ ప్రముఖ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా జరిగిన ఈ సభ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గా౦ధీ హాజరయ్యారు.

ఈ సభ సందర్భంగా ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి నిరాకరించింది. ప్రజలు ప్రైవేటు వాహనాల్లో వస్తూ ఉంటే వాళ్ళను రాకుండా బీఆరెస్ ప్రభుత్వం అడ్డుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. సభకు ప్రజలు తరలి రాకుండా ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించిందని ఆ పార్టీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ రెణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సభ జరిగిన ఐదురోజులకే వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోడీ సభ జరిగింది. ఈ సభకు బీజేపీ ప్రజలను బాగానే తరలించింది. కాగా, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మోడీ ప్రభుత్వం నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు, పలు ప్రజాసంఘాలు మోడీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. మోడీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నట్టు అధికార బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

అయితే మోడీ పర్యటన సందర్భంగా బీఆరెస్ ప్రభుత్వం వామపక్షాల, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసి మోడీకి వ్యతిరేకంగా నిరసనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంది.

ఈ రెండు సంఘటనలు బీజేపీ బీఆరెస్ మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని బహిర్గతపరుస్తున్నాయని కాంగ్రెస్ మండిపడింది.

అంతే కాదు, గత కొంత కాలంగా జరుగుతున్న బీఆరెస్ సభల్లో బీఆరెస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతకు ముందు ప్రతి రోజూ బీజేపీ పై విరుచుకపడే కేసీఆర్ సడెన్ గా రూటు మార్చి బీజేపీని వదిలేసి కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం పట్ల కూడా కాంగ్రెస్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గత నెలలో నిర్మల్, నాగర్‌కర్నూల్, గద్వాల్‌లలో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నే తార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. బీజేపీని విమర్శించకుండా చేసిన కేసీఆర్ ప్రసంగాలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. “ఇది బిఆర్‌ఎస్, బిజెపిల మధ్య ప్యాకేజీలో భాగం తప్ప మరొకటి కాదు. సిబిఐ, ఈడి, ఇతర కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటామని బెదిరించడం ద్వారా బిజెపి దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఇదే వ్యూహాన్ని ఉపయోగిస్తోంది” అని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో అనేక మందిని అరెస్టు చేసిన బీజేపీ ప్రభుత్వం కవితను అరెస్టు చేయకపోవడం న్వారి8 మధ్య ఒప్పందంలో భాగమే కాంగ్రెస్ విమర్శిస్తోంది.

ఇంతకూ ఏది నిజం ? బీఆరెస్ బీజేపీ చేస్తున్నామని చెప్తున్న పోరాటం నిజమా ? లేక కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు ఆ పార్టీతో రహస్య ఒప్పందం నిజమా ? ఏదేమైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్న విషయం మాత్రం నూటికి నూరు శాతం నిజం.