అమరావతి : అకాల వర్షాలకు ఏపీలోని చాలా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతుల కోసం తెలుగుదేశం పార్టీ పోరుబాట పట్టనున్నట
అమరావతి : అకాల వర్షాలకు ఏపీలోని చాలా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతుల కోసం తెలుగుదేశం పార్టీ పోరుబాట పట్టనున్నట్లు వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో నేడు రైతులతో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు టీడీపీ వెల్లడించింది. ‘రైతు పోరుబాట’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రైతులతో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఆ తర్వాత భారీ సభలో ప్రసంగించనున్నారు.
తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర చంద్రబాబు నాయుడి పాదయాత్ర సాగనుంది. 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే ఈ పాదయాత్ర పలు గ్రామాల మీదుగా వెళ్తుందని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు 11వ తేదీ సాయంత్రమే ఉండవల్లి నుంచి తణుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ నెల 4, 5, 6వ తేదీల్లో చంద్రబాబు పంట నష్ట ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రతిపక్షం ఇచ్చిన డెడ్‌లైన్‌పై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీ పోరుబాట చేయనున్నట్లు ప్రకటించింది. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై టీడీపీ అధినేత ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయనున్నారు. ఈ మధ్య అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో అగ్రికల్చర్, హార్టి కల్చర్ పంటలకు నష్టం వాటిల్లింది. తక్షణమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.