HomeTelanganaPolitics

మీ శవాలు కూడా దొరకవు ఖబర్దార్! …ఇట్లు బీఆరెస్

మీ శవాలు కూడా దొరకవు ఖబర్దార్! …ఇట్లు బీఆరెస్

ఒకవైపు బీజేపీ నేత ఈటల రాజేంధర్ ను హత్య చేసేందుకు బీఆరెస్ నేతలు కుట్ర చేశ్తున్నారంటూ ఈటల భార్య జమున ఆరోపించి సంచలనం సృష్టించి మూడురోజులు గడవకముందే. రే

అబద్దాలు ప్రచారం చేయడంలో దేశంలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ?
16 రోజులు… 54 సభలు… ప్రచార జోరు పెంచనున్న కేసీఆర్
మీడియా సెంటర్ ను ప్రారంభించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి

ఒకవైపు బీజేపీ నేత ఈటల రాజేంధర్ ను హత్య చేసేందుకు బీఆరెస్ నేతలు కుట్ర చేశ్తున్నారంటూ ఈటల భార్య జమున ఆరోపించి సంచలనం సృష్టించి మూడురోజులు గడవకముందే. రేపు కాంగ్రెస్ లో చేరబోతున్న మాజీ బీఆరెస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులను బెధిరిస్తూ ఖమ్మం జిల్లాలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. రేపు ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ గా‍ంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో ఈ బెదిరింపు పోస్టర్లు ప్రత్యక్షమవడం కలకలం రేపుతున్నాయి.

పొంగులేటి ఖబడ్దార్ అనే హెడ్డింగ్ తో ఉన్న ఆ పోస్టర్లలో…”ఖమ్మం జిల్లా ప్రజలారా ఒక్క సారి ఆలోచించండి. మన మంత్రివర్యులు అజయ్ గారి మీద కావాలని కొంతమంది కుక్కలు చెడు చేయడానికి చూస్తున్నారు. పొంగులేటి అనుచరులమంటూ కొంతమంది మీడియాలో ప్రచారం కోసం దిగజారుడు పని చేస్తున్నారు. మువ్వా విజయ్ బాబు నీకు మూడిందిరా ! ఇంకో కుక్క చీకటి కార్తీక్ గాడికి మిస్ అయ్యింది. వచ్చి అజయ్ గారి కాళ్ళు పట్టుకొని క్షమించమని మీరు అడగకపోతే మీ శవాలు కూడా దొరకవు. JAI BRS” అని రాసి ఉంది.

కాగా బీఆరెస్ పేరుతో ప్రత్యక్షమైన బెదిరింపు పోస్టర్ల పట్ల కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన‌ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని తన అనుచరుల ను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా… “నా అనుచరుల ను చంపుతామని బెదిరిస్తున్నారు.. వారి వార్నింగుల కు భయపడేది లేదు.. వచ్చే ఎన్నికల లో వారికి ప్రజలే బుద్ది చెబుతారు” అని పొంగులేటి పేర్కొన్నారు. ఇదే సమయం లో రేపు సభ ముగిసేంత వరకు మంచి నీళ్ల సరఫరా బంద్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఈ నెల 2వ తేదీన జరగనున్న జనగర్జన సభలో కాంగ్రెస్ లో చేరుతున్నానని.. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఖమ్మం సభ సక్సెస్ చేసి తీరుతామని ఈ సందర్భంగా పొంగులేటి స్పష్టం చేశారు.